https://oktelugu.com/

Hit 3 Teaser: హిట్ 3 టీజర్ రివ్యూ: అర్జున్ సర్కార్ గా నాని, అంచనాలు పీక్స్ కి చేర్చిన ప్రోమో!

హిట్ సిరీస్ లో మూడో పార్ట్ వచ్చేస్తుంది. నాని నటిస్తుండగా నేడు టీజర్ విడుదల చేశారు. అలాగే విడుదల తేదీ సైతం ప్రకటించారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న హిట్ 3 టీజర్ అంచనాలు పెంచేదిగా ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 5, 2024 / 02:16 PM IST

    Hit 3 Teaser

    Follow us on

    Hit 3 Teaser: హీరో నాని వరుస విజయాలతో జోరు మీదున్నారు. దసరా తో బ్లాక్ బస్టర్ నమోదు చేసిన నాని, హాయ్ నాన్న చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. లేటెస్ట్ రిలీజ్ సరిపోదా శనివారం సైతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. నెక్స్ట్ ఆయన క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. హిట్ 3 సిరీస్ లో అర్జున్ సర్కార్ గా ఓ పవర్ఫుల్ కాప్ అవతారం ఎత్తనున్నాడు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన శైలేష్ కొలను దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే.

    శైలేష్ కొలను డెబ్యూ మూవీ హిట్(హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్). శైలేష్ కొలను హిట్ యూనివర్స్ లో రెండు చిత్రాలు వచ్చాయి. ఫస్ట్ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. హిట్ : ఫస్ట్ కేసు విజయం సాధించింది. మంచి వసూళ్లు రాబట్టింది. వాల్ పోస్టర్ సినిమా పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన హీరో నాని హిట్ నిర్మించారు. ఈ సిరీస్లో రెండో చిత్రంగా హిట్ 2 విడుదలైంది. అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో సుహాస్ విలన్ రోల్ చేయడం విశేషం.

    హిట్ 2 సైతం సక్సెస్ అయ్యింది. హిట్ 2 క్లైమాక్స్ లో డైరెక్టర్… హిట్ 3లో నాని నటిస్తున్నట్లు రివీల్ చేశాడు. ఆపై ఎలాంటి ప్రకటన లేదు. మధ్యలో వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్ కి దర్శకత్వం వహించాడు. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన సైంధవ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే నాని-శైలేష్ కొలను హిట్ 3 షూటింగ్ ఎప్పుడు మొదలెట్టారు అనేది తెలియదు. సడన్ గా ప్రోమో తో పాటు విడుదల తేదీ ప్రకటించారు.

    అర్జున్ సర్కార్ గా నాని ఇంట్రో సీన్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఇండియన్ బోర్డర్ లో నాని కారులో వెళుతుంటే కొందరు అటాక్ చేస్తారు. అర్జున్ సర్కార్ పై అటాక్ చేస్తే ఆయనకు ప్రమాదం కాదు… అటాక్ చేసిన వాళ్లకు ప్రమాదం అని ఓ పాత్ర నాని క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం అదిరింది. నాని లుక్ సైతం ఆకట్టుకుంది. సమ్మర్ కానుకగా 2025 మే 1న సర్కార్ మూవీ విడుదల కానుంది. హిట్ 3 సైతం నాని బ్యానర్ లోనే తెరకెక్కుతుంది.