https://oktelugu.com/

Parenting Tips: అందరి ముందే మీ పిల్లలను కొడుతున్నారా? మీ రిలేషన్ ఇక అంతే సంగతులు

ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఈ దిశగా పనులు కూడా చేస్తారు. అంతేకాదు వారి భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా చేస్తుంటారు. పిల్లల ఫ్యూచర్ బాగుండాలని, వారు సరైన మార్గంలో నడవాలని ప్రతి విషయంలో జాగ్రత్త పడతారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 5, 2024 / 02:21 PM IST

    Parenting Tips

    Follow us on

    Parenting Tips: మిమ్మల్ని ఎవరైనా నలుగురిలో నిల్చోపెట్టి తిడితే బాధ అనిపిస్తుంది కదా. మీకు మాత్రమే కాదు మీ పిల్లలకు కూడా అదే విధంగా అనిపిస్తుంది. చాలా మంది పేరెంట్స్ తప్పు చేస్తే చాలు ఎక్కడున్నామని చూడకుండా పిల్లలను తెగ తిడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మీ పిల్లలపై చాలా ప్రభావం పడుతుందట. మరి మీ తిట్ల వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందామా?

    ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఈ దిశగా పనులు కూడా చేస్తారు. అంతేకాదు వారి భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా చేస్తుంటారు. పిల్లల ఫ్యూచర్ బాగుండాలని, వారు సరైన మార్గంలో నడవాలని ప్రతి విషయంలో జాగ్రత్త పడతారు. క్రమశిక్షణగా పెంచుతారు. అయితే ఇది కొన్ని సార్లు హద్దులు దాటుతూ ఉంటుంది. అప్పుడే అసలు సమస్య మొదలు అవుతుంది. పిల్లలు ఎదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఒక్కోసారి చాలా కోపాన్ని ప్రదర్శిస్తారు.

    అందరి ముందూ కోపంతో ఊగిపోతూ తిడుతుంటారు. ఒక్కోసారి అయితే ఎవ్వరున్నారని కూడా చూడకుండా కొడుతుంటారు కూడా. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవుతారట. దీంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. అయితే పిల్లలు ఏదైన తప్పు చేస్తే అందరి ముందు కొట్టడం, అరవడం చేయకూడదు.

    పెరుగుతున్న డిప్రెషన్..: ‘ది జర్నల్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్’లో ఓ నివేదిక వచ్చింది. అదేంటంటే.. అందరి ముందు పిల్లలపై అరవడం కానీ, కొట్టడం కానీ చేస్తే వారు ఒత్తిడికి లోనవుతారట. అంతేకాదు డిప్రెషన్ లోకి వెళ్తారు. అలాగే పిల్లలు నిరాశ నిస్పృహలకు కూడా లోనవుతున్నారు అని తెలిసింది.

    అరిస్తే ఆత్మవిశ్వాసం కోల్పొతున్నారు: పిల్లలపై అరవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. బాల్యంలో పిల్లలను ఎక్కువగా తిడితే వారిలో ఆత్మవిశ్వాసం పోయి తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉందట. దీనివల్ల ఆ పిల్లవాడు తన స్నేహితులతో సరిగ్గా ఉండకుండా ఒంటిరిగా ఉండే అవకాశం కూడా ఉంటుందట.

    షాక్ లోకి వెళ్తున్నారు: పిల్లల్ని తల్లి దండ్రులు తిట్టడం కానీ వారిపై గట్టి గట్టిగా అరవడం వల్ల షాక్ లోని వెళ్లే చాన్స్ ఉంది. ఇలా చేస్తే కొన్నిసార్లు వారి వారి మెదడు స్తంభించి పోతుంది. కార్టిసాల్, ఆడ్రినలిన్ హార్మోన్లను పెంచే మెదడులోని భాగాలను ఇది నేరుగా ప్రభావితం చేసి వారి లైఫ్ ను ఇబ్బంది పెడుతుంది అంటున్నారు నిపుణులు.

    కోపం: పిల్లల మనస్సు చాలా సున్నితం. దీని వల్ల వారు తొందరగా బాధ పడి వారి మనసును గాయ పరుచుకుంటారు. ఇలాంటప్పుడు అందరి ముందు వారిని తిట్టడంతో వారికి ఒక్కసారిగా కోపం వస్తుంది. దీంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు ఇతరుల ముందు తిట్టడం, కొట్టడం వల్ల మీ మీద వారికి కోపం వచ్చి మీతో రిలేషన్ ను కూడా సరిగ్గా మెయింటెన్ చేయరు. సో మీ మీద చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏకంగా మీతో సురక్షితంగా ఉండలేమని అనుకుంటారు. మీ పైన నమ్మకం పోతుంది అంటున్నారు నిపుణులు. అందుకే మీ పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త.