https://oktelugu.com/

Vijay Devarakonda: సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ కాంబోలో రానున్న మరో సినిమా…ఇది కూడా బోల్డ్ కంటెంట్ తోనే వస్తుందా..?

సందీప్ వంగ విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించిందో మనందరికి తెలిసిందే...ఈ ఒక్క సినిమాతో వీళ్ళు ఓవర్ నైట్లో స్టార్లు అయిపోయారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 5, 2024 / 02:03 PM IST

    Vijay Devarakonda

    Follow us on

    Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మంచి గుర్తింపు ఉంటుంది ఆ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ కూడా చాలావరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నిజానికి ఆ కాంబినేషన్స్ ను సెట్ చేయడంలోనే ప్రస్తుతం ప్రొడ్యూసర్లు కూడా చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కి కూడా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ ని కూడా చాలా అద్భుతంగా కట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ ఒక్క సినిమాతో వీళ్ళిద్దరి లైఫ్ లు మారిపోయాయనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో వీరిద్దరూ వేరే దర్శకులతో హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

    కానీ వీళ్ళ కాంబినేషన్ లో మాత్రం మరొక సినిమా అయితే రావడం లేదు. ఇక ఇప్పుడు సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక వీరిద్దరూ రీసెంట్ గా కలుసుకొని ఒక కథ గురించి కూడా డిస్కస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కథకు విజయ్ మాత్రమే బాగా సెట్ అవుతారని సందీప్ రెడ్డి వంగ నమ్ముతున్నారట. అందువల్లే విజయ్ తో సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన మొదటి సినిమా హీరో కాబట్టి విజయ్ తో సందీప్ కి ఆటోమేటిగ్గా ఒక మంచి బాండింగ్ అయితే ఉంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తో ఒక సినిమా చేసి సక్సెస్ ఫుల్ సినిమాగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

    మరి వీళ్ళిద్దరూ ఎలాంటి సినిమాని తెరమీదకి తీసుకురాబోతున్నారు అర్జున్ రెడ్డి లాంటి ఒక బోల్డ్ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన వీళ్లు మరోసారి అదే బోల్డ్ కంటెంట్ తో వచ్చి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయబోతున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… మరి ఈ సినిమాతో సందీప్ వంగ, విజయ్ దేవరకొండ ఇద్దరు ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…