Hit 3 : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit: The Third Case) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఆరు రోజుల లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేయబోతుంది. నాని ‘దసరా’ చిత్రం ఫుల్ రన్ లో 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది, దీనిని ‘హిట్ 3’ కచ్చితంగా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో మూవీ టీం గ్రాండ్ గా నిర్వహించింది. ఈవెంట్ కి హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో పాటు మూవీ టీం మొత్తం పాల్గొన్నది.
Also Read: ‘హిట్ 3’ లో లేడీ విలన్ గా నటించిన ఈమెని గుర్తుపట్టారా..? వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అయితే ఈ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో ఇప్పుడు మన సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని నిర్వహించడం అంత అవసరమా అని మా మూవీ టీం నన్ను అడిగారు. అప్పుడు నేను వాళ్లకు ఒక్కటే చెప్పాను, మన ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ చేస్తున్న ప్రతీ చర్యకు వంద రెట్లు ఎక్కువ రియాక్షన్ ఇస్తుంది. వాళ్ళ కుట్రలను మొత్తం భగ్నం చేస్తుంది. ఆ పాకిస్థాన్ వాళ్లకు మా వల్ల ఒక సినిమా ఈవెంట్ రద్దు అయ్యింది అనే ఆనందం కూడా ఇవ్వకూడదు అనే ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేద్దామని చెప్పాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘శైలేష్ తో నేను భవిష్యత్తులో కూడా సినిమా చేస్తాను. కానీ ఈసారి మా కాంబినేషన్ లో ఇలాంటి సినిమాలు రావు, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ మా కాంబినేషన్ లో రాబోతుంది. శైలేష్ తీసే జానర్ సినిమాలను చూసి, ఇతను కామెడీ జానర్ సినిమాలు కూడా తీస్తాడా అని మీ అందరికీ ఆశ్చర్యం వేయొచ్చు. కానీ శైలేష్ తో పని చేసే వాళ్ళకే అతని కామెడీ టైమింగ్ ఏంటో తెలుస్తుంది. షూటింగ్ సమయం లో ఆయన వేసిన జోక్స్ కి మేమంతా పగలబడి నవ్వేవాళ్ళం. ఇంత కామెడీ టైమింగ్ పెట్టుకొని, కామెడీ జానర్ లో సినిమాలు తీయకపోతే ఎలా?, కచ్చితంగా భవిష్యత్తులో మా కాంబినేషన్ లో అలాంటి సినిమా రాబోతుంది. ఇప్పటికే నాకు ఒక లైన్ చెప్పాడు. చాలా హిలేరియస్ గా అనిపించింది, త్వరలోనే ఆ లైన్ మీద సినిమా చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
Also Read : ‘హిట్ 3’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో నష్టాలు తప్పేలా లేవు!
#HIT3 – Is it necessary to celebrate the success of a film during these sensitive times? Check out Nani’s response. pic.twitter.com/B7CHR4zJ17
— Aakashavaani (@TheAakashavaani) May 9, 2025