Hit 3 and Retro : సినిమా ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఒక మూవీ వచ్చింది అంటే ఆ సినిమాను బీట్ చేస్తూ మరొక మూవీ వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే నిన్న రిలీజ్ అయిన హిట్ 3(Hit 3), రెట్రో (Retro) సినిమాలు ఎలా ఉన్నాయి? ఈ రెండింటిలో ఏ సినిమా విజయాన్ని సాధించింది. ఏ సినిమా డిజాస్టర్ గా మిగిలింది అనే విజయాలను మనం ఒకసారి తెలుసుకుందాం.
నాని (Nani) హీరోగా శైలేష్ కొలన్ (Shailesh Kolen) దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సినిమా ఒక వర్గం ప్రేక్షకులని కొంతవరకు మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే నానిని చూసి ఈ సినిమాని చూడడానికి వచ్చిన చాలామంది జనాలు సినిమా థియేటర్లో కొచ్చి కూర్చున్న తర్వాత నాని వైలెన్స్ ని చూసి భయపడిపోయారు. నాని ఏంటి ఈ నరకడం ఏంటి? అనే కాన్సెప్ట్ లో ఆడియన్స్ కొంతవరకు కన్ఫ్యూజ్ అయి సినిమాని చూశారు. అంతే తప్ప వాళ్లు సినిమాను ఓన్ చేసుకునే విధంగా అయితే సినిమా లేకపోవడం దాని ద్వారా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉండకపోవడం వల్ల సగటు ప్రేక్షకుడు కొంతవరకు నిరాశపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అనుకున్న సినిమా కేవలం యావరేజ్ దగ్గరే ఆగిపోయిందనే చెప్పాలి.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?
సూర్య (Surya) హీరోగా కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) డైరెక్షన్ లో వచ్చిన రెట్రో (Retro) సినిమా ట్రైలర్ ని చాలా కన్ఫ్యూజన్ తో కట్ చేశారు. అది చూసిన ప్రతి ఒక్కరు రెట్రో సినిమా అయితే హిట్ అవుతుంది, లేకపోతే డిజాస్టర్ అవుతుందని పూర్తిస్థాయి నమ్మకానికి అయితే వచ్చేశారు. ఇక వాళ్ళందరూ అనుకున్నట్టుగానే సినిమా ప్రేక్షకుడిని ఎక్కడ కూడా ఎంగేజ్ అయితే చేయలేదు.
మొదటి 10 నిమిషాలు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) స్టైల్లో ముందుకు సాగినప్పటికి ఇక ముందుకు వెళుతున్న కొద్దీ కార్తీక్ సుబ్బరాజు పైత్యం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కథతో కూడా సినిమాలు చేస్తారా అని ప్రేక్షకుడికి చిరాకు పుట్టి థియేటర్ నుంచి బయటికి వచ్చే విధంగా ఈ సినిమా ఉండడం అనేది నిజంగా చాలా బ్యాడ్ విషయం అనే చెప్పాలి.
గత సంవత్సరం సూర్య (Surya) కంగువ (Kanguva) సినిమాతో ఒక డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో ప్లాప్ ను అందుకున్నాడనే చెప్పాలి. ఈ వారం రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో నాని కొంతవరకు పర్లేదు అనిపిస్తే సూర్య మాత్రం డిజాస్టర్ ని మూటగట్టుకుని తన ఖాతాలో మరొక ప్లాప్ ను చేర్చుకున్నాడు…ఇక సూర్య, నాని పోటీలో ఇద్దరి సినిమాలు పెద్ద గొప్పగా ఏం లేవు కానీ రెట్రో తో పోలిస్తే హిట్ 3 కొంతవరకు పర్లేదు.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!