HIT 3 movie : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజానికి లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగిన హీరోలెవ్వరు కూడా స్టార్ హీరోలుగా మారలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే లవ్ స్టోరీస్ కామెడీ సినిమాల్లో సెటిల్డ్ ఎమోషన్ ని పండించే క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి. దానివల్ల ప్రేక్షకులందరికి ఆయా హీరోలు నచ్చుతూ ఉంటారు. కానీ కమర్షియల్ సినిమాలను చేసేవాళ్ళకి బీ,సీ సెంటర్లో ఎక్కువ ఆదరణతో అయితే దక్కుతోంది. ఇక బీ,సీ సెంటర్లో ఒక్కసారి మార్కెట్ కనక క్రియేట్ అయితే వాళ్లు సినిమా హిట్ అయిన, ఫ్లాప్ అయిన సంబంధం లేకుండా వరుసగా మూడు నాలుగు సార్లు రిపీటెడ్ గా సినిమాలను చూస్తూ ఉంటారు. తద్వారా మాస్ లో ఎక్కువ ప్రాధాన్యత సంపాదించుకున్న హీరోల సినిమాలను మాత్రమే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఆదరిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాని లాంటి స్టార్ హీరో అయితే మాస్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. హిట్ 3 (Hit 3) సినిమాతో తనను తాను మాస్ హీరోగా ఎలివేట్ చేసుకున్నప్పటికి ఆ తర్వాత రాబోతున్న ప్యారడైజ్ (Paradaise) సినిమాతో మరోసారి తనలోని పూర్తి మాస్ యాంగిల్ ని బయటికి తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read : రామ్ చరణ్ దెబ్బ కి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందా..?
తద్వారా ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక నాని మాస్ ఇమేజ్ ని కోరుకోవడంలో తప్పులేదు.
కానీ మొదటి నుంచి కూడా మన పక్కింటి అబ్బాయిల ఉంటాడు అనే గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా ప్లేట్ మారుస్తూ మాస్ సినిమాలు చేయడం వల్ల ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను గానీ, లవ్ స్టోరీస్ ను ఇష్టపడే వాళ్ళు గాని, నాని లోని ఒక మేనరిజం ని ఫాలో అయ్యే వాళ్ళు గాని ప్రతి ఒక్కరూ తీవ్రమైన నిరాశనైతే చెందుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తను మాస్ హీరోగా మారాడు అంటే సెటిల్డ్ పర్ఫామెన్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మన చుట్టూ ఉండే మన ఫ్రెండులా, నైబర్ లా నటించే ఫ్రీడమ్ కోల్పోతాడు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ నాని సినిమాలను ఇకమీదట పెద్దగా చూసే ఆస్కారం అయితే లేదనే చెప్పాలి…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న నాని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఏం చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
Also Read : గుణశేఖర్ దర్శకత్వం లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఎలా మిస్సయింది..?