Hit 3 Movie : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit: The Third Case) మే1 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న తెలిసిందే. ఈ చిత్రం పై అటు నాని అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, భారీ రేంజ్ లో గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లక్షా 50 వేల గ్రాస్ వచ్చింది. ‘సరిపోదా శనివారం’ అడ్వాన్స్ బుకింగ్స్ కంటే ఈ సినిమాకే మంచి ట్రెండ్ కనిపించింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 7 లక్షల డాలర్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Also Read : స్పీడ్ పెంచిన అనుష్క..ఏకంగా 7 సినిమాలకు గ్రీన్ సిగ్నల్..రెమ్యూనరేషన్ ఎంతంటే!
ఇక కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. ఇప్పటి వరకు విడుదలైన నాని అన్ని సినిమాలకంటే ఈ చిత్రానికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్పీడ్ గా ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభించిన కొద్దీ సేపటికే 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం హైదరాబాద్ సిటీ నుండి వచ్చాయి. స్పీడ్ చూస్తుంటే కేవలం నైజం ప్రాంతం నుండే ఈ చిత్రం మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టేలా అనిపిస్తుంది. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి డబుల్ డిజిట్ షేర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాని నటించిన ‘దసరా’ చిత్రానికి గతం లో ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి. మళ్ళీ ఆ రేంజ్ ఈ చిత్రానికి రాబోతుంది. సినిమా సినిమాకు నాని ఆడియన్స్ లో ఏర్పాటు చేసుకుంటున్న నమ్మకం కారణంగానే ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ టాక్ కూడా చాలా సాలిడ్ గా ఉంది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మంచి ఉత్కంఠభరితంగా, ఒక సరైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని చూసినట్టుగానే అనిపించింది అంటూ మూవీ టీం కి కితాబు ఇచ్చారట. అంతే కాకుండా సెకండ్ హాఫ్ చాలా బలంగా ఉందని, సరైన సినిమా లేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ కి మంచి సినిమాని అందించారని అన్నారట. కానీ కొన్ని బూతులను, హింసాత్మక సన్నివేశాలను తొలగించమని ఆదేశించారట. ఓవరాల్ గా ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసారు. అంటే 18 సంవత్సరాలకంటే చిన్న వాళ్ళు ఈ చిత్రాన్ని చూసేందుకు వీలు లేదు. ఈ చిత్రం లో అడవి శేష్ కాసేపు కనిపిస్తాడట. అదే విధంగా క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఉంటుందట. హిట్ 4 లో హీరో ఆయనే అనే విధంగా ఒక హింట్ ఇస్తారట చివర్లో.
Also Read : సీరియల్ లో తల్లి పాత్రలో పద్ధతిగా.. నెట్టింట్లొ మాత్రం అందాలతో సెగలు…