Shubham Collection: సమంత(Samantha Ruth Prabhu) నిర్మాతగా కొత్త నటీనటులతో తీసిన ‘శుభమ్'(Subham Movie) చిత్రం ఇటీవలే విడుదలై మొదటి ఆట నుండే అనూహ్యమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా పై మొదటి నుండి సమంత చాలా ధీమా తో ఉన్నింది. కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతాను అంటూ ప్రతీ ప్రమోషన్ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద హిట్ అనొచ్చు. ఎందుకంటే సమంత బ్రాండ్ ఇమేజ్ మరియు టీజర్ కారణంగా ఈ సినిమా డిజిటల్+ సాటిలైట్ + ఆడియో రైట్స్ భారీ రేట్ కి అమ్ముడుపోయింది. ఈ చిత్రం కోసం సమంత కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా ఖర్చు చేసి ఉండదు. కానీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల 80 లక్షలకు జరిగింది. మూడు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read: అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ లోనే ఉంటుందా..?
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లో 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. హీరో , హీరోయిన్ల పేర్లు కూడా తెలియవు, అయినప్పటికీ ఇంత వసూళ్లు రావడం అనేది ఈ బుల్లి సినిమాకు గొప్ప ఘనతే అని చెప్పొచ్చు. ఇక కోస్తాంధ్ర+ సీమాంధ్ర కలిపి ఈ చిత్రానికి మూడు రోజుల్లో 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో సమంత బ్రాండ్ పవర్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి. కేవలం సమంత పేరుని చూసి ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో 2 లక్షల డాలర్ల బిజినెస్ జరిగింది.
మూడు రోజుల్లో ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి లక్షా 30 వేల డాలర్లు వచ్చాయి. ఈ వారం తో పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరనుంది. సంక్రాంతి సీజన్ తర్వాత మన టాలీవుడ్ లో విడుదలైన సినిమాలలో ఎక్కువ శాతం ఫ్లాప్ అయ్యినవే ఉన్నాయి. టాలీవుడ్ మళ్ళీ సంక్షోభం లో పడింది, థియేటర్స్ మూతపడుతున్నాయి అంటూ నిర్మాతలు కామెంట్స్ చేశారు. సరిగ్గా అలాంటి సమయంలోనే నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి, టాలీవుడ్ కి కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘సింగిల్’ పెద్ద హిట్ అయ్యింది, ‘శుభమ్’ కూడా దుమ్ములేపేసింది. కీలక సమయంలో ఈ రెండు చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ పాలిట దేవుడు లాగా నిలిచాయి.