Hit 3 Collections: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit :The Third Case) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని వారం గడిచే లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో రెండు సార్లు వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టిన నాని, ఇప్పుడు మూడవ సారి ‘హిట్ 3’ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నాడు. మరో మీడియం రేంజ్ హీరో నాని దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ కొరత ఉంటుంది అనేది మనకి సినిమా విడుదలకు ముందే తెలుసు. అందుకే కలెక్షన్స్ రోజురోజుకు తగ్గిపోతూ వచ్చాయి. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read: Hit 3 : ‘హిట్ 3’ లో లేడీ విలన్ గా నటించిన ఈమెని గుర్తుపట్టారా..? వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
ఈ చిత్రం నైజాం ప్రాంతం హక్కులను దిల్ రాజు జీఎస్టీ తో కలిపి 13 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే, మొదటి వారంలోనే 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 5 కోట్ల 40 లక్షల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, మొదటి వారం లో 4 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కచ్చితంగా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకోవాలి. లేకపోతే ఈ ప్రాంతం లో నష్టాలు తప్పేలా లేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలన్నిటికీ కలిపి 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, మొదటి వారం లో 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Rajinikanth : తలైవాకు ప్రియురాలిగా, తల్లిగా, చెల్లిగా నటించిన ఒకే ఒక హీరోయిన్ ఎవరో తెలుసా…
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 5 కోట్ల 50 లక్షల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, మొదటి వారం 6 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో పది కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, ఈ చిత్రానికి మొదటి వారంలో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి ఇక్కడ డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, 53 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయలకు జరగగా, ఇప్పటి వరకు మూడు కోట్లు లాభం వచ్చింది, కానీ సీడెడ్, నెల్లూరు ప్రాంతాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపుగా కష్టం అనే అనుకోవాలి.