Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికి కూడా రజనీకాంత్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రజనీకాంత్ సినిమా కెరియర్లో ఒక హీరోయిన్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరో రజినీకాంత్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. మన దేశంతో పాటు విదేశాలలో కూడా రజనీకాంత్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అభిమానులు రజనీకాంత్ ను ముద్దుగా తలైవా అని పిలుస్తారు. ఈయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పటివరకు రజినీకాంత్ వందల హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ కూడా ఈయన సినిమా కోసం కోట్ల మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. రజనీకాంత్ ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రజనీకాంత్ సినిమా కథతో ప్రాధాన్యత ఇచ్చి కుర్రా హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు. తమిళనాడులో ఈయన సినిమా అంటే థియేటర్ల దగ్గర పెద్ద పండగ అని చెప్పడంలో సందేహం లేదు.
Also Read : మమ్ముట్టి, దుల్కర్ కి ఉన్న ఆ ఒక్క క్వాలిటీ చిరంజీవి, రామ్ చరణ్ లకు లేదా..?
అప్పట్లో ఈయన సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది అంటే పలు సంస్థలు సెలవులు కూడా ప్రకటించేవి. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయినా ఒక్క సినిమాకు రెండు వందల కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా రజినీకాంత్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కు భార్యగా, తల్లిగా అలాగే ప్రియురాలిగా నటించిన ఒకే ఒక హీరోయిన్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చ జరుగుతుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు దివంగత హీరోయిన్ శ్రీదేవి.
శ్రీదేవి రజనీకాంత్ పక్కన హీరోయిన్ గానే కాకుండా ఒక సినిమాలో కలిగా కూడా నటించడం జరిగింది. అలాగే శ్రీదేవి రజనీకాంత్ కు ప్రియురాలిగా, చెల్లిగా కూడా నటించడం జరిగింది. దివంగత నటి శ్రీదేవి తనకు 13 ఏళ్ల వయసులో రజనీకాంత్ తల్లి పాత్రలో నటించారు. 1976 లో రిలీజ్ అయిన మండ్రు ముడిచు అనే సినిమాలో శ్రీదేవి హీరో రజనీకాంత్ కు తల్లిగా నటించారు. శ్రీదేవికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 22 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే చాలా సినిమాలలో రజనీకాంత్ కు భార్యగా, ప్రియురాలిగా శ్రీదేవి నటించిన. అలాగే చెల్లిగా కూడా నటించారు.
