Hit 3 : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక స్టార్ హీరోలుగా మారాలనే ఉద్దేశ్యంతో మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇకమీదట యంగ్ హీరోలు చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…
శైలేష్ కొలన్ (Shailesh Kolen) డైరెక్షన్ లో నాని(Nani) హీరోగా వస్తున్న హిట్ 3 (hit 3) సినిమా మే ఒకటోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో నాని ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం తను చేస్తున్న సినిమాతో ప్రేక్షకులను అలరించాలని తద్వారా తను కూడా తన క్యారెక్టరైజేషన్ లో వేరియేషన్స్ ను చూపించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి పాత్రను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అర్జున్ సర్కార్ గా తను నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఒక సైకో టైప్ ఆఫ్ పాత్రలో తను ఏ విధంగా నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నాని లాంటి స్టార్ హీరోకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక మరోసారి ఈ సినిమాతో తన ఇమేజ్ ను రెట్టింపు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా చివర్లో తమిళ్ స్టార్ హీరో అయిన కార్తీ (Karthi) నిపించబోతున్నాడట. ఇక హిట్ 4 (Hit 4) సినిమాలో అతను హీరో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
అతను హీరోగా హిట్ 4 సినిమాను తెరకెక్కించి ఈ ఫ్రాంచైజ్ ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నాని చివర్లో చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కార్తీ వచ్చి ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చి సినిమాకి ముగింపు పలకబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అక్కడి నుంచి తను మరొక కేసును డీల్ చేస్తూ హిట్ ఫోర్ సినిమాకి లీడ్ తీసుకోబోతున్నారట. మరి ఏది ఏమైనా ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే మాత్రం నాని తన ఖాతాలో వరుసగా నాలుగో విజయాన్ని సాధించిన వాడు అవుతాడు. లేకపోతే మాత్రం భారీగా డీలా పడడమే కాకుండా ఆయన మార్కెట్ కూడా భారీగా డౌన్ అయిపోతుంది.
ఇక పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డు ను సైతం క్రియేట్ చేస్తుంది అనే కాన్ఫిడెంట్ ను నాని వ్యక్తం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు ఆయన కంటూ ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?