Hit 3 : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాని లోని ఊర మాస్ యాంగిల్ ని బయటకు తీస్తూ డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సోషల్ మీడియా లో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఈ సినిమా గురించి ఇసుమంత నెగటివ్ టాక్ కూడా లేదు. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. నేడు లేబర్ డే సందర్భంగా నేషనల్ హాలిడే కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమాకు 8 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ నడుస్తున్న సమయంలో గంటకు 20 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు తప్ప, మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఊపు చూస్తుంటే మొదటి రోజు టికెట్ సేల్స్ బుక్ మై షో నుండి 5 లక్షలకు పైగా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది సాధారణమైన విషయం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి మొదటి రోజున కనీసం లక్ష 50 వేల టికెట్స్ కూడా అమ్ముడుపోలేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఓవరాల్ గా జరుగుతున్నా టికెట్ సేల్స్, ప్రతీ షో కి పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే, మొదటి రోజు ఈ చిత్రానికి కచ్చితంగా 35 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వీకెండ్ ముగిసేలోపు ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. నాని గత చిత్రాలు ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరితేనే అద్భుతం జరిగినట్టు చూసారు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు ఆయన ఏకంగా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నారు. సినిమా సినిమాకు ఆయన ఎదుగుదల ఏ రేంజ్ లో ఉంటుందో మీరే చూడండి. ఈ సినిమాకే ఈ రేంజ్ విద్వంసం సృష్టిస్తే, వచ్చే ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోయే ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మొదటి రోజే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. రేడియో జాకీ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఒక కుర్రాడు, ఈరోజు సూపర్ స్టార్ అయ్యే దిశగా అడుగులు వేయడం నిజంగా స్ఫూర్తిదాయకం.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?