Poonam Kaur: ఫేడ్ అవుట్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక రచ్చకు తెర తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెట్టే ప్రతి ట్వీట్ లో, ప్రతి పోస్ట్ లో ఎన్నో నిగూడార్థాలు ఉంటాయి. అసలు అందరిదీ ఒక బాధ అయితే.. ఆమెది మరో బాధ అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహారం. దీనికితోడు తనకు సంబంధించిన ప్రతిదీ నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పూనమ్ పెట్టిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

పైగా ఆ ట్వీట్ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఎందుకంటే పూనమ్ పాప పెట్టిన ట్వీట్ విడాకుల అంశంపై గురించి. “విడాకుల తర్వాత నిజంగా మగవారికి నిజంగానే పెయిన్ ఉండదా? కేవలం ఆడవాళ్లు మాత్రమే ఇబ్బందులు పడతారా.. ? లేదంటే.. ఆడవాళ్లే మగవారిని మాటలతో బాధిస్తారా ? ఆడవారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజం పక్షపాత ధోరణిని ఏమైనా ప్రొజెక్ట్ చేస్తుందా.. ?
ఇప్పటికైనా మనం అసలు విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నామా ? విడాకుల అంశం పై మనందరికీ కచ్చితమైన క్లారిటీ, సరైన దృక్కోణం ఉందంటారా ?” అంటూ ఇష్టమొచ్చినట్లు రాసుకుంటూ పోయింది పూనమ్. పైగా ఈ ట్వీట్ పెట్టిన గంటకే దాన్ని ఆమె డిలీట్ చేసింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసలు ట్వీట్ ఎందుకు పోస్ట్ చేసింది ? మళ్లీ ఎందుకు డిలీట్ చేసింది..? విడాకుల అంశం పై ఈమెకు ఎందుకు ఇంత ఆత్రుత ? ఇంకా పెళ్లి కాలేదు కదా ? పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా అనేక ఆరోపణలు చేస్తూ.. మధ్యమధ్యలో పవన్ ను సపోర్ట్ చేస్తూ అసలు ఆమె బాధ ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా సాగుతుంది పూనమ్ ప్రవర్తన.
ఏది ఏమైనా టాలీవుడ్ లో #pklove అనే హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ ఎంతో వైరల్ అయింది. ఇక హిట్ అవ్వకుండానే ఫేడ్ అవుట్ అయిన ఈ పంజాబీ భామకు మైండ్ సరిగ్గా లేదని ఈ మధ్య ఓ నటుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అయితే పవన్ విడాకుల పైనే పూనమ్ ఇలా సెటైర్లు వేసింది అంటున్నారు నెటిజన్లు.