https://oktelugu.com/

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో శివుడి ఫోటోలు ఉంటే పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి!

Vastu Tips: ప్రతి రోజు మనం ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలామంది పూజామందిరంలో ఎన్నో రకాల దేవుడి ఫోటోలకు పూజలు చేస్తుంటారు.ఇలా ప్రతిరోజూ దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటమే కాకుండా మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఇక ప్రతి ఇంటిలో దేవుడి గదిలో ఉన్న ఫోటోలలో శివుడి ఫోటో తప్పకుండా ఉంటుంది. ఇంట్లో శివుడి ఫోటోను ఉంచుకున్న సమయంలో […]

Written By: , Updated On : December 8, 2021 / 01:46 PM IST
Follow us on

Vastu Tips: ప్రతి రోజు మనం ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలామంది పూజామందిరంలో ఎన్నో రకాల దేవుడి ఫోటోలకు పూజలు చేస్తుంటారు.ఇలా ప్రతిరోజూ దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటమే కాకుండా మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఇక ప్రతి ఇంటిలో దేవుడి గదిలో ఉన్న ఫోటోలలో శివుడి ఫోటో తప్పకుండా ఉంటుంది. ఇంట్లో శివుడి ఫోటోను ఉంచుకున్న సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Vastu Tips

Vastu Tips

పూజా మందిరంలో శివుడి ఫోటో ఉంచి పూజ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ముఖ్యంగా శివుడి ఫోటో పూజగదిలో ఎలా పడితే అలా పెట్టి పూజ చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. కనుక పూజామందిరంలో శివుడి ఫోటో కేవలం ఉత్తర దిశవైపు మాత్రమే పెట్టాలి.ఇలా పెట్టి పూజ చేయటం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడకుండా సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి కలహాలు లేకుండా ప్రేమానురాగాలు ఏర్పడతాయి.

Also Read: వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఈ తప్పులు చేస్తే… సమస్యలు తప్పవు!
శివుడి ఫోటో పూజ గదిలో కేవలం ఉత్తర దిశ వైపు మాత్రమే ఉంచాలని మరే దిశ వైపు ఉంచి పూజ చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా పరమేశ్వరుడిని పూజించడమే కాకుండా నిత్యం పూజ గది ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆర్థికాభివృద్ధి కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: నెలకు రూ.5,000 కడితే కొత్త కారు మీ సొంతం.. ఏ విధంగా అంటే?