OG Movie: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call him OG) మేనియా నే కనిపిస్తుంది. అభిమానులతో పాటు, ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ ట్రేడ్ మొత్తం ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఎందుకంటే సంక్షోభం లో ఉన్న సినిమా ఇండస్ట్రీ ని ఈ చిత్రం కచ్చితంగా కాపాడుతుంది అనే నమ్మకం. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ ఒక రేంజ్ లో పేలింది. నిన్న పవన్ పుట్టినరోజు కానుకగా విడుదలైన చిన్న గ్లింప్స్ వీడియో కూడా ఒక రేంజ్ లో పేలింది. ఈమధ్య కాలం లో సౌత్ ఇండియా లో ఇంతటి క్వాలిటీ కంటెంట్ రాలేదని, డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి ఉంటాడని అందరిలో ఒక నమ్మకం క్రియేట్ అయ్యింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా గురించి ఒక చేదు వార్త సోషల్ మీడియా లో అభిమానులను నిరాశకు గురి చేసింది.
Also Read: బుద్ధి లేదా నీకు అంటూ రిపోర్టర్ పై నాగార్జున ఫైర్.. వీడియో వైరల్!
అదేమిటంటే ఈ సినిమాకు సంబంధించిన హిందీ మరియు తమిళ వెర్షన్స్ తెలుగు తో పాటు విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువ గా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం మూవీ టీం ఫోకస్ మొత్తం తెలుగు వెర్షన్ ని పూర్తి చేయడం పైనే ఉందట. మిగిలిన వెర్షన్స్ జోలికి తెలుగు పూర్తి అయ్యాకే ఆలోచిస్తారట. అందుకే పాటలు కూడా వెంతంటే హిందీ మరియు తమిళ వెర్షన్స్ లో విడుదల చేయలేకపోయారు. ఫైర్ స్ట్రోమ్ పాటను ముందుగా తెలుగు వెర్షన్ లోనే విడుదల చేశారు. తెలుగు వెర్షన్ లో విడుదలైన వారం రోజుల తర్వాత తమిళం మరియు హిందీ వెర్షన్ పాటలు విడుదల అయ్యాయి. ఇక ఆ తర్వాత విడుదలైన రెండవ పాట ‘సువ్వి సువ్వి’ కి సంబంధించి తమిళం మరియు హిందీ వెర్షన్స్ ఇంకా విడుదల అవ్వలేదు. నిన్న విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కూడా ఈ రెండు భాషల్లో అందుబాటులోకి రాలేదు.
దీనిని చూసిన తర్వాత ఈ చిత్రం హిందీ మరియు తమిళ వెర్షన్స్ సెప్టెంబర్ 25 న విడుదల అవుతాయనే ఆశలు వదిలేసుకున్నారు అభిమానులు. సెప్టెంబర్ 25 న కాకపోయినా, కనీసం ఇక్కడ విడుదలైన వారం రోజులకు హిందీ మరియు ఇతర భాషల్లో విడుదల చెయ్యాలని అభిమానులు ప్రాధేయపడుతున్నారు. తమ అభిమాన హీరో నుండి రాక రాక వస్తున్న అద్భుతమైన క్వాలిటీ సినిమా అని, దయచేసి అన్ని భాషల్లో విడుదల చేయమని కోరుకుంటున్నారు. మరి మేకర్స్ అభిమానుల కోరికని మన్నిస్తారో లేదో చూడాలి.