https://oktelugu.com/

Kaun Banega Crorepati 13: కోటి గెలిచిన హిమానీ.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?

Kaun Banega Crorepati 13: కౌన్ బనేగా కరోడ్ పతి (Kaun Banega Crorepati) ఎంత పాపులారిటీ అయిందో తెలిసిందే కదా. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ గా హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి లక్షల్లో అభిమానులున్నారు. ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోంది. దీంతో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా హిమానీ బుందేలా (Himani Bundela) అనే యువతి పోటీలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకుంది. దీంతో […]

Written By: , Updated On : September 1, 2021 / 06:25 PM IST
Follow us on

Kaun Banega Crorepati 13Kaun Banega Crorepati 13: కౌన్ బనేగా కరోడ్ పతి (Kaun Banega Crorepati) ఎంత పాపులారిటీ అయిందో తెలిసిందే కదా. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ గా హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి లక్షల్లో అభిమానులున్నారు. ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోంది. దీంతో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా హిమానీ బుందేలా (Himani Bundela) అనే యువతి పోటీలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకుంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కింది.

25 ఏళ్ల బుందేలా దృష్టి లోపంతో బాధపడుతున్నా పోటీలో నిలిచి కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. బుందేలా మునుపటి ఎపిసోడ్ లో రూ.50 లక్షలు గెలుచుకుంది. ఆమె గత రాత్రి ఎపిసోడ్ లో రోల్ ఓవర్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ కోటి రూపాయల ప్రశ్న ప్రారంభించారు. హిమానీ బుందేలా రూ. కోటి గెలుచుకోవడానికి అమితాబ్ అడిగిన ప్రశ్న ఏమిటంటే బ్రిటిష్ గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన మారుపేరు ఏమిటి? ఈ ప్రశ్నకు బుందేలా చాలా ఆలోచించిన తరువాత చివరికి లాక్ చేయమని సూచించింది.

నాలుగు ఆప్షన్లుండగా వరా అట్కిన్స్, క్రిస్టినా స్మార్ టెక్, జూలియన్ బస్నర్, జీన్-మేరీ రెనియర్స్. దీనికి సమాధానం జీన్ – మేరీ రెనియర్స్ అని హిమానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది. దీంతో కోటి రూపాయలు గెలుచుకుంది. ఆ తరువాత జాక్ పాట్ ప్రశ్న అడిగారు. దీనికి ఏడు కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు. కానీ దీనికి బుందేలా గందరగోళానికి గురై పోటీ నుంచి తప్పుకుంది.

అయితే జాక్ పాట్ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పుకున్నందుకు కోటి రూపాయలతో పాటు ఒక కారు కూడా బహుమతిగా వచ్చింది. దీంతో ఇక జాక్ పాట్ ప్రశ్న విషయానికి వస్తే 1923లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ కు సమర్పించిన థీసిస్ శీర్షిక ఏమి? సమాధానాల్లో ది వాంట్ అండ్ మీన్స్ ఆఫ్ ఇండియా, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపాయి, నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపాయి. అయితే హిమానీ తప్పు సమాధానం చెప్పడంతో పోటీ నుంచి తప్పుకుంది.