వర్మ ‘మర్డర్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రణయ్-అమృత ప్రేమ కథతో‘మర్డర్’ మూవీని తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకొని వర్మ మార్క్ స్టైల్లో ఈ మూవీని తెరక్కించాడు. అయితే  దర్శకుడు వర్మ తన కథను అనుమతి లేకుండా సినిమాగా తెరకెక్కించడంపై అమృత నల్లొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘మర్డర్’ మూవీలో ప్రణయ్-అమృత ప్రేమగాథ.. ఆ తర్వాత ప్రణయ్ హత్య.. అమృత తండ్రి […]

Written By: NARESH, Updated On : November 6, 2020 7:54 pm
Follow us on

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రణయ్-అమృత ప్రేమ కథతో‘మర్డర్’ మూవీని తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకొని వర్మ మార్క్ స్టైల్లో ఈ మూవీని తెరక్కించాడు. అయితే  దర్శకుడు వర్మ తన కథను అనుమతి లేకుండా సినిమాగా తెరకెక్కించడంపై అమృత నల్లొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

‘మర్డర్’ మూవీలో ప్రణయ్-అమృత ప్రేమగాథ.. ఆ తర్వాత ప్రణయ్ హత్య.. అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్యను వర్మ ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అమృత క్యారెక్టర్ ను నెగిటివ్ గా చూపించినట్లు ‘మర్డర్’ ఫస్టు లుక్.. ట్రైలర్ చూస్తే అర్థమవుతుందనే కామెంట్స్ విన్పించాయి. దీంతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించింది.

Also Read: మహేష్ ‘పాట’ పాడకుండానే 57కోట్ల లాభం..!

‘మర్డర్’ మూవీని నిలిపివేయాలంటూ అమృత నల్గొండ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు వర్మ ‘మర్డర్’ సినిమా విడుదల కాకుండా స్టే ఇచ్చింది. దీనిపై వర్మ సైతం హైకోర్టు వెళ్లగా ‘మర్డర్’పై వర్మకు అనుకూలంగా తాజాగా తీర్పు వచ్చింది. ఈ విషయాన్ని వర్మ తన ట్వీటర్లో వెల్లడించాడు.

Also Read: పవన్ బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం అక్కడే !

‘మర్డర్’ సినిమాకు గౌరవనీయమైన కోర్టు నుంచి అనుమతి రావడం చాలా సంతోషంగా ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు. ‘మర్డర్’ విడుదలపై త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానంటూ చెప్పాడు. దీంతో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుందా? లేక ఓటీటీలో రిలీజు అవుతుందా? అనే ఆసక్తి మొదలైంది.