https://oktelugu.com/

మహేష్ ‘పాట’ పాడకుండానే 57కోట్ల లాభం..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ జన్మదినం ఈ మూవీ ప్రారంభమైన నేటికీ రెగ్యూలర్ షూటింగ్ కు మాత్రం నోచుకోలేదు. అయినప్పటికీ ‘సర్కారువారిపాట’ అదిరిపోయే బిజినెస్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మహేష్ సత్తా ఏంటో ‘సర్కారువారిపాట’ చూపిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘సర్కారువారిపాట’లో మహేష్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటిస్తోంది. దీంతో ఈ మూవీపై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 05:24 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ జన్మదినం ఈ మూవీ ప్రారంభమైన నేటికీ రెగ్యూలర్ షూటింగ్ కు మాత్రం నోచుకోలేదు. అయినప్పటికీ ‘సర్కారువారిపాట’ అదిరిపోయే బిజినెస్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మహేష్ సత్తా ఏంటో ‘సర్కారువారిపాట’ చూపిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘సర్కారువారిపాట’లో మహేష్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటిస్తోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్నేళ్లుగా మహేష్ బాబు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ మూవీ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

    Also Read: మరోసారి రెచ్చిపోయిన రోజా-శేఖర్ మాస్టర్..!

    ఈ సినిమా హిట్టు కూడా ‘సర్కారువారిపాట’ బిజినెస్ కు బాగా కలిసొచ్చినట్లు కన్పిస్తోంది. బ్యాంక్ కుంభకోణాలను బయటికి తీసే కథాంశంతో దర్శకుడు పర్శురాం ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగు త్వరలోనే అమెరికాలో ప్రారంభం కానుంది. ‘సర్కారువారిపాట’ మూవీ షూటింగు ప్రారంభం కాకుండానే అదిరిపోయే బిజినెస్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

    ‘సర్కారువారిపాట’ నాన్ థియేట్రికల్ హక్కుల కింద 57కోట్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు టీవీ.. డిజిటల్ రైట్స్  కింద సుమారు 35కోట్లు.. తమిళ టీవీ.. డిజిటల్ హక్కుల కింద 7కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలోనూ మహేష్ సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తంగా ‘సర్కారువారిపాట’ నాన్ థియేట్రికల్ హక్కుల కింద 57కోట్ల లాభాలు గడించినట్లు తెలుస్తోంది.

    Also Read: వర్మ ‘మర్డర్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..!

    ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సరికొత్త రికార్డులు సృష్టించేలా కన్పిస్తోంది. మొత్తంగా మహేష్ సినిమా షూటింగ్ కు ముందే భారీ లాభాలు గడిస్తూ అతడి సత్తా ఏంటో చూపిస్తోంది. ‘సరిలేరునికెవ్వరు’తో 200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన మహేష్ బాబు ‘సర్కారువారిపాట’తో ఎంత కలెక్షన్లు రాబడుతారనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.