https://oktelugu.com/

మరోసారి రెచ్చిపోయిన రోజా-శేఖర్ మాస్టర్..!

పండుగ సమయంలో బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు నిర్వహించడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. ప్రతీ ఛానల్ కూడా ఏదో ఒక స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈటీవీ.. జెమినీ.. స్టార్ మా.. జీ తెలుగు వంటి ఛానళ్లు స్పెషల్ కార్యక్రమాలు చేయడంలో పోటీపడుతుండటం చూస్తూనే ఉంటాం. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ దసరా సందర్భంగా కూడా ఛానళ్లు స్పెషల్ కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను అలరించాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా మరోసారి బుల్లితెరపై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 05:47 PM IST
    Follow us on

    పండుగ సమయంలో బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు నిర్వహించడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. ప్రతీ ఛానల్ కూడా ఏదో ఒక స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈటీవీ.. జెమినీ.. స్టార్ మా.. జీ తెలుగు వంటి ఛానళ్లు స్పెషల్ కార్యక్రమాలు చేయడంలో పోటీపడుతుండటం చూస్తూనే ఉంటాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దసరా సందర్భంగా కూడా ఛానళ్లు స్పెషల్ కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను అలరించాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా మరోసారి బుల్లితెరపై దుమ్ములేపే కార్యక్రమాలను నిర్వహించేందుకు చానళ్లు రెడీ అవుతున్నాయి. ఇప్పటి నుంచే దీపావళికి సంబంధించిన స్పెషల్ ప్రోమోలను విడుదల చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి.

    Also Read: వర్మ ‘మర్డర్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..!

    తాజాగా ఈటీవీలో జబర్దస్త్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం కలిసి ‘కనక మహాలక్ష్మీ లక్కీ డ్రా’ అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. దీనిలో సీనియర్ హీరోయిన్ రోజా.. శేఖర్ మాస్టర్.. యాంకర్ శ్రీముఖి.. బాలీవుడ్ నటుడు సోనూ సూద్.. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సందడి చేయడం కన్పించింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

    Also Read: మహేష్ ‘పాట’ పాడకుండానే 57కోట్ల లాభం..!

    ఉట్టి మీద కూడు ఉప్పు చాప తోడు అనే పాటకు రోజా-శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులేశారు. రోజా అదిరిపోయే హాట్ ఫార్మెమెన్స్ తో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి అందరూ షాకయ్యారు. జబర్దస్త్ కామెడీయన్లు ఫార్మమెన్స్.. యాంకర్ శ్రీముఖి.. శేఖర్ మాస్టర్.. రోజాల మధ్య పులిహోర మాటలు.. అనూప్ రూబెన్ సంగీతం ఆకట్టుకున్నాయి. వీటితోపాటు మరికొన్ని స్పెషల్ కార్యక్రమాలను చూపిస్తూ ఈటీవీ దీపావళి ప్రోమోను రిలీజ్ చేసి ఆకట్టుకుంది.

    https://www.youtube.com/watch?v=ijadR3gl4uo&feature=emb_title