Vijay Deverakonda Wedding House Video: ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్రేమ జంట గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) లు ఈనెల 26 న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో పాటు, వీళ్లిద్దరికీ సినీ పరిశ్రమలో అత్యంత ఆప్తులైన వారు ఈ వివాహ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి ఇప్పటి వరకు ఈ జంట సోషల్ మీడియా ద్వారా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, జరగాల్సిన పనులను మాత్రం చకచకా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. రీసెంట్ గానే ముంబై లో షాపింగ్ చేస్తూ కనిపించిన ఈ జంట, నేడే హైదరాబాద్ కి తిరిగొచ్చింది. ఇదంతా పక్కన పెడితే తాము ప్రైవేట్ స్పేస్ లో ఈ పెళ్లి చేసుకుంటున్నామని, అందుకు అందరూ గౌరవించాలని, కానీ కొంతమంది మా పెళ్లి శుభ లేఖని సోషల్ మీడియా లో లీక్ చేయడం అన్యాయమని, మా ఎమోషన్స్ కి విలువ ఇవ్వాలి కదా అంటూ విజయ్ దేవరకొండ తన టీం వద్ద ఆవేదన వ్యక్తం చేశాడట.
ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ ఇల్లు పెళ్లికి ముస్తాబుకైపోయింది. ధగధగా మెరిసే విద్యుత్ దీపాలను ఇంటి మొత్తానికి అమర్చాడు విజయ్ దేవరకొండ. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రైవసీ కావాలంటారు, ఇలాంటివన్నీ జనాలకు కనపడేలా చేస్తారు, అభిమానులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయకుండా ఉంటారా చెప్పండి?, తమ అభిమాన హీరో కెరీర్ లో ఎంతో ముఖ్యమైన ఈ సందర్భాన్ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంటారు కదా. అందరికీ తెలిసిన విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి ఏమైంది?, ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ప్రస్తుతం ‘రణబలి’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇదే. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసి విజయ్ దేవరకొండ ఫ్రీ అయిపోయాడు. మరోపక్క రష్మిక కూడా ఈ సినిమాతో పాటు, ఆమె చేస్తున్న మరికొన్ని సినిమాలకు సంబంధించిన కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసి ఆమె కూడా ఫ్రీ అయ్యింది. ఇద్దరు ఇలా ఫ్రీ అవ్వడం వల్లే పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంట నెల రోజులపాటు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనరట. విదేశాలకు హనీమూన్ ట్రిప్ వేయబోతున్నట్టు సమాచారం.
Wedding vibes take over #VijayDeverakonda’s home as celebrations begin in style! ✨#RashmikaMandanna #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/tcOO3m1ocw
— Telugu FilmNagar (@telugufilmnagar) February 18, 2026