https://oktelugu.com/

Kubera Story Leak : కుబేర సినిమా స్టోరీ లీక్…నాగార్జున, ధనుష్ ల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి..?

ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులందరి మధ్య చాలా తేడాలు ఉంటాయి. కొంత మంది డైరెక్టర్స్ మాస్ ఆడియెన్స్ కోసం సినిమాలు చేస్తే, మరికొంత మంది మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం సినిమాలు చేస్తారు..ఇక అందులో శేఖర్ కమ్ముల ఒకరు..

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 07:06 PM IST
    Follow us on

    Kubera Story Leak : కుబేర సినిమా స్టోరీ లీక్…నాగార్జున, ధనుష్ ల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి..? తెలుగు సినిమా ఇండస్ట్రీలో టేస్ట్ ఉన్న డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన తీసిన ఆనంద్ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ అనే చెప్పాలి. ఇక మొదటి సినిమా నుంచి నాగ చైతన్య తో చేసిన లవ్ స్టోరీ సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఫిల్మ్ అనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఎమోషన్స్ తో ప్రేక్షకుడిని కట్టిపడేయడమే కాకుండా ఆయన సినిమా తాలూకు డెప్త్ ను కూడా చాలా బాగా మెయిటెన్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన ప్రతి సినిమాలో ఒక ప్రేమ కథ తో పాటు ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. దాన్ని ఆయన ప్రాపర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక అందుకే ఆయన సినిమాలకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కనెక్ట్ అవుతూ ఉంటారు…ఇక కొత్త హీరోలతో సినిమాలు చేయడంలో ఆయన చాలా వరకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్ ని హీరోగా పెట్టి ‘ కుబేర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇందులో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి కుబేర అనే టైటిల్ ని ఎందుకు పెట్టారు అనే విషయం మీద చాలా రోజుల నుంచి చాలా చర్చలైతే నడుస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి…

    ఇక ఈ సినిమా స్టోరీ ని కనక మనం ఒకసారి చూసుకున్నట్లైతే ధనుష్ క్యారెక్టర్ మొదట్లో డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనే ఒక అహంకారంతో ఉంటాడట. కానీ ఒకానొక సందర్భంలో ఆయన డబ్బు మొత్తం పోయి బిచ్చగాడిలా మారతారట. మరి ఇలాంటి సందర్భంలో నాగార్జున వచ్చి ధనుష్ కి ఒక మనిషి గొప్పతనాన్ని చెప్పి ప్రతి మనిషిలో ఉండే కొన్ని మోరల్ వాల్యూస్ గురించి తెలియజేస్తాడట. ఇక దాంతో మళ్లీ మనిషిలా మారి డబ్బు కంటే మనిషి గొప్పవాడు అనే ఒక స్టేజ్ కి వస్తాడట. ఇక దాంతో మళ్ళీ తిరిగి ఆయన డబ్బు సంపాదించుకున్నాడా లేదా అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుందట.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగార్జున, ధనుష్ ఇద్దరు భారీ సక్సెస్ ని అందుకోబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇక ధనుష్ కూడా చాలా రోజుల నుంచి భారీ సక్సెస్ అయితే కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఆయన ఊహించిన సక్సెస్ అయితే దక్కుతుందంటూ ఆయన అభిమానులు కూడా చాలా వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇక రీసెంట్ గా తన స్వీయ డైరెక్షన్ లో వచ్చిన ‘రాయన్ ‘ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాబట్టి కుబేర సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుంటాడని తన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాతో ఇటు శేఖర్ కమ్ముల అటు నాగ్, ధనుష్ లు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది..