https://oktelugu.com/

Heroines: వ్యాపారస్థులను పెళ్లి చేసుకున్న హీరోయిన్ లు

Heroines: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ రాణించడం చాల కష్టం. కానీ ఒకసారి హిట్ అయితే లైఫ్ మారిపోతుంది. అంతేకాదు సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ తిరిగి నిలదొక్కుకోవడం కూడా కష్టమే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 26, 2024 / 10:47 AM IST

    Heroines who married businessmen

    Follow us on

    Heroines: ఎతంటి స్టార్లు అయినా సామాన్యులు అయినా పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి పట్ల ఎన్నో విషయాలు ఆలోచించి అడుగు వేయాలి. జీవితంలో ఎదగడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. మన జీవితంలోకి మరో వ్యక్తి వచ్చిన తర్వాత కాస్త రిలీఫ్, సంతోషం, సంతృప్తి ఉండాలి. జీవితంలోకి వచ్చే వ్యక్తి తోడు నీడలా కష్టసుఖాలను పంచుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. లేదా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కొందరు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఇక అన్నిటినీ షాసించేది డబ్బు అని తెలిసిన వారు డబ్బున్న వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఇక హీరోయిన్ లు ఏ రేంజ్ లో సంపాదిస్తారో తెలిసిందే. కానీ వారికి ఆ స్టార్ డం ఎప్పటికీ ఉండదు. కొందరు డబ్బు కోసం, మరికొందరు ఇష్టంతో మొత్తం మీద వ్యాపారస్థులను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు.మరి వారెవరో ఒకసారి లిస్ట్ చూసేద్దాం…

    సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ రాణించడం చాల కష్టం. కానీ ఒకసారి హిట్ అయితే లైఫ్ మారిపోతుంది. అంతేకాదు సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ తిరిగి నిలదొక్కుకోవడం కూడా కష్టమే. కొంతమంది ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో నుంచి వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరి కెరియర్ ఎన్నాళ్లు ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే చాలా మంది ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడుతుంటారు. అయితే కొంత మంది హీరోయిన్లు ఫేమ్ ఉన్నప్పుడు సినిమాల్లోనటించి ఫేడ్ అవుట్ అయితే పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుంటారు. అలా హీరోయిన్ గా సినిమాల్లో చేసి ఆ తర్వాత బిజినెస్ మ్యాన్స్ ని పెళ్లి చేసుకున్నవారే ఎక్కువ..

    కాజల్ అగర్వాల్.. చందమామ సినిమాతో మంచి విజయం అందుకుంది కాజల్. ఈ సినిమాను కృష్ణ వంశీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దాదాపు 10 సంవత్సరాల వరకు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగి తనదైన ముద్ర వేసుకుంది కాజల్. ఇక 2020లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన గీతమ్ కీచ్లును పెళ్లి చేసుకొని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది. వీళ్లకి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ కాబోతుంది అమ్మడు. మరి తన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి…

    హన్సిక..అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది ముద్దుగుమ్మ. ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సరసన కూడా నటించింది హన్సిక. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా నటించింది. కానీ ఈ మధ్య ఆమె సినిమాల్లో కనిపించలేదు. అయితే అవకాశాలు రాకపోవడంతో సోహైల్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఈ జంట అన్యోన్యతకు ఎంతో మంది మంత్రముగ్దులు అవుతుంటారు. అయితే సోషల్ మీడియాలో హన్సిక తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది.

    పూర్ణ.. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన సీమ టపాకాయ సినిమాలో అల్లరి నరేష్ సరసన మెప్పించింది పూర్ణ. ఈ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది కూడా. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఢీప్రోగ్రాం జడ్జిగా చేసిన ఆమె దుబాయికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అయిన హమిద్ అసిఫ్ అలీని మనువాడింది. అయితే పూర్ణ అసలు సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మళ్లీ పూర్ణ వేగం పుంజుకోనున్నట్టు టాక్.

    ప్రియమణి.. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ప్రియమణి ఒకటి రెండు సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా గుర్తింపును సంపాదించి పెట్టలేదు. కానీ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఈమె కూడా సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఢీ షోలో జడ్జిగా చేసింది. అయితే ఈ అమ్మడు కూడా ప్రముఖ బిజినెస్ మ్యాన్ ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది.

    శిల్ప శెట్టి.. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శిల్ప శెట్టి. తెలుగులో కూడా నటించింది ఈ అమ్మడు. బలేవాడివి బాసూ సినిమాతో పాటు, వెంకటేష్ హీరోగా వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఈమె కూడా ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయినా రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది.