Trisha : త్రిష ప్రస్తుత వయసు 39 సంవత్సరాలు. ఏజ్ బార్ అవుతున్నా ఆమె పెళ్లి మాట ఎత్తడం లేదు. అప్పుడప్పుడు కొన్ని పుకార్లు వినిపిస్తున్నా… అవి గాలి వార్తలు గానే మిగిపోతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న త్రిషకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. బాగా లేటైంది, వివాహం ఎప్పుడు చేసుకుంటారని విలేకరి అడుగగా… త్రిష ఆసక్తికర సమాధానాలు చెప్పింది. 40 ఏళ్ళు వస్తున్నా నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. అలాగే వివాహం ఎప్పుడు చేసుకుంటానో కూడా తెలియదు అన్నారు.

అయితే మనసుకు నచ్చిన వాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని త్రిష వెల్లడించారు. ఇక తనకు కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలు కూడా త్రిష వెల్లడించాడు. నా భర్తగా రాబోయేవాడికి నాపై పూర్తి విశ్వాసం ఉండాలి. జీవితాంతం నాకు తోడుగా ఉంటాడనే నమ్మకం కలిగించాలి. వివాహం తర్వాత విడాకులు తీసుకోవడం, మధ్యలో విడిపోవడం నాకు నచ్చదు. శాశ్వతంగా నాతో ఉండేవాడిని పెళ్లి చేసుకుంటానని త్రిష మనసులో మాట బయటపెట్టారు.
త్రిష కోరుకుంటున్న లక్షణాలు ఉండేవాడు దొరికేది ఎప్పుడు? ఆమె వివాహం జరిగేది ఎప్పుడు? అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా 2015లో త్రిష బిజినెస్ మాన్ వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఈ వివాహాన్ని త్రిష రద్దు చేసుకుంది. ఆ మధ్య హీరో శింబుకి ఆమె దగ్గరయ్యారన్న పుకార్లు చక్కర్లు కొట్టాయి. పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. త్రిషతో కూడా శింబు ప్రేమాయణం సుకాంతం కాలేదు.
ఓ దశాబ్దం క్రితం స్టార్ లేడీగా త్రిష సౌత్ ఇండియాను ఊపేశారు. ముఖ్యంగా తెలుగులో భారీ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. రెండు తరాల స్టార్స్ తో త్రిష నటించారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తమిళంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ రిలీజ్ పొన్నియిన్ సెల్వన్ భారీ విజయం సాధించింది. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా రానుంది. పార్ట్ 1 దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


