https://oktelugu.com/

Sreeleela: రాఘవేంద్రరావు రుణాన్ని తీర్చుకోలేదట.. కుర్ర భామ కొత్త కబుర్లు

Sreeleela: శ్రీలీల.. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో బాగా పాపుల‌ర్ అవుతున్న యంగ్ క్రేజీ హీరోయిన్. ప్ర‌స్తుతం శ్రీలీల కు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సినీరంగం అంటేనే గ్లామ‌ర్. అందులో ముఖ్యంగా హీరోయిన్‌లు ఎంత గ్లామ‌ర్‌గా క‌నిపిస్తే అంతగా అవ‌కాశాలు వ‌స్తుంటాయి. అందుకే శ్రీలీల అందాలకు తెలుగు తెర ఫిదా అయిపోయింది. అందాలను అరబోయడంలో ఈ చిన్నది అప్పుడే మాస్టర్ డిగ్రీ చేసేసింది. అయితే శ్రీలీల మాత్రం తాను కేవలం గ్లామ‌ర్‌ ను మాత్రమే […]

Written By:
  • Shiva
  • , Updated On : July 7, 2022 / 07:57 AM IST
    Follow us on

    Sreeleela: శ్రీలీల.. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో బాగా పాపుల‌ర్ అవుతున్న యంగ్ క్రేజీ హీరోయిన్. ప్ర‌స్తుతం శ్రీలీల కు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సినీరంగం అంటేనే గ్లామ‌ర్. అందులో ముఖ్యంగా హీరోయిన్‌లు ఎంత గ్లామ‌ర్‌గా క‌నిపిస్తే అంతగా అవ‌కాశాలు వ‌స్తుంటాయి. అందుకే శ్రీలీల అందాలకు తెలుగు తెర ఫిదా అయిపోయింది. అందాలను అరబోయడంలో ఈ చిన్నది అప్పుడే మాస్టర్ డిగ్రీ చేసేసింది.

    raghavendra rao sreeleela

    అయితే శ్రీలీల మాత్రం తాను కేవలం గ్లామ‌ర్‌ ను మాత్రమే నమ్ముకోలేదు అని.. రానున్న రోజుల్లో అన్ని రకాల పాత్రలను పోషిస్తాను అని అమ్మడు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా గ్లామ‌ర్‌ కు అతీతంగా, న‌ట‌న ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను కూడా ఎంచుకుని గొప్ప నటిగా తనకంటూ గొప్ప పేరు తెచ్చుకుంటాను అని శ్రీలీల చెబుతుంది. ఏది ఏమైనా శ్రీలీలకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

    Also Read: Krithi Shetty: అదేమిటి ? ఎందుకు అని అడిగితే ? అది బయట పెట్టింది

    బయట ప‌ద్ద‌తిగా కనిపించడం.. అదే స్క్రీన్ పై అందాలతో చెలరేగిపోవడం ఇలా ప్లేస్ ను బట్టి ఎక్స్ పోజింగ్ తో ముందుకు పోతున్న శ్రీలీల అంటే.. సినిమా మేకర్స్ కి కూడా అభిమానం కలిగింది. అందుకే.. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా ప్రస్తుతం శ్రీలీల సరికొత్త రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది.

    raghavendra rao sreeleela

    ఇదిలా ఉంటే టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలో తానూ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం.. ఓ సీనియర్ దర్శకుడు అని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఆయనే కోవెలమూడి రాఘవేంద్రరావు. తెలుగు సినీ రంగంలో తనకు మొదటి అవకాశం ఇచ్చి.. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన దర్శకేంద్రుడి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అని శ్రీలీల ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.

    ఇక డాన్సుల్లో శ్రీ‌లీల‌ ఈజ్ చూస్తే కచ్చితంగా కుర్రాళ్ళ మ‌తి పోగొట్టేలా ఉంది. ఇప్పటికే ర‌వితేజ సినిమాలో శ్రీ‌లీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆమె ఖాతాలో మరికొన్ని సినిమాలు వచ్చినట్టు తెలుస్తోంది. శ‌ర్వా, నితిన్‌ సినిమాల్లో కూడా ఆమెకు అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి. మొత్తమ్మీద నిర్మాతల ఆత్రమే శ్రీ‌లీల‌కు అదృష్టంగా మారింది.

    Also Read:Goutham Raju: గౌతం రాజు కుటుబానికి పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి.. ఎంత సాయం చేశాడో తెలుసా?

    Tags