Krithi Shetty: ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసింది కృతి శెట్టి. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. ప్రస్తుతం తన గ్లామర్ తో, యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఉప్పెన మూవీ ఇచ్చిన సక్సెస్ తో కృతి శెట్టి పెద్దగా కష్టపడకుండానే వరుస ఆఫర్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్స్ లిస్ట్ లో.. ‘కృతి శెట్టి’ పేరే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.
ఇటీవల కాలంలో రష్మిక మందన్నా తర్వాత మూడు, నాలుగు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ కృతి శెట్టినే కావడం విశేషం. అయితే తక్కువ టైంలోనే ఇలా ఆఫర్లు వచ్చినా అంత సంతృప్తికరంగా లేదట కృతి శెట్టి. అదేమిటి ? ఎందుకు అని అడిగితే ? అసలు విషయం బయట పెట్టింది. కృతి శెట్టి ఉప్పెన సినిమా రిలీజ్ సమయంలో తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ను కలుసుకుందట.
Also Read: Chiranjeevi- Balakrishna: బాలయ్యకి పోటీగా మెగాస్టార్.. మరీ దీనిలో కూడా పోటీనా ?
అప్పటి నుంచి కృతి శెట్టికి ఎన్టీఆర్ పై అభిమానం కలిగిందట. అందుకే.. ఇపుడు వస్తున్న ఆఫర్లు కాకుండా ఎన్టీఆర్ సినిమాలో అవకాశం కోసం అమ్మడు ఆశగా ఎదురుచూస్తుందట. ఎన్టీఆర్ తో పాటు మహేశ్ బాబు, రాంచరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకోవాలని ఈ యంగ్ బ్యూటీ తెగ ఆరాట పడుతుంది.
ముందుగా తనకు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే బాగుంటుందని కృతి శెట్టి ఓపెన్ గా చెప్పేస్తోంది. పైగా రీసెంట్ గా కొరటాల శివను కూడా కృతి శెట్టి పర్సనల్ గా వెళ్లి కలిసిందట. కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. పైగా కొరటాల శివ ఏన్టీఆర్ తో చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి మోషన్ పోస్టర్ వీడియోను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు.
ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన ఈ వీడియోలో భారీ విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఈ సినిమాలో తనకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి అని కృతి శెట్టి మొత్తానికి కొరటాలకు రిక్వెస్ట్ పెట్టుకుంది. అయితే.. ఈ సినిమాలో ఇప్పటికే సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది.
Also Read:Alia Bhatt: ఫస్ట్ నైట్ పై ఓపెన్ గా చెప్పేసిన ఆలియా భట్.. వైరల్