Childhood Photo Story: సినిమా హీరోయిన్ కావాలంటే అందం, అభినయంతో పాటు గ్లామర్ షో చేయాలి. కానీ కొందరు భామలు సాంప్రదాయంగా కనిపించి ఆకట్టుకున్నారు. అచ్చమైన తెలుగు అమ్మాయిలా.. సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అలరించారు. ఈ విషయంలో ముందుగా సావిత్రి పేరు చెప్పుకుంటాం.. ఆ తరువాత సౌందర్య గురించి మాట్లాడుకుంటాం.. అయితే గ్లామర్ షో చేయకపోతే సినిమాల్లో అవకాశాలుండని కొందరి అభిప్రాయం. కానీ నేటి కాలంలోనూ సాంప్రదాయంగా కనిపిస్తూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఓ భామ. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఓ డైరెక్టర్ ను లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హవా చూపిస్తోంది. ఆమెకు సంబంధించిన ఓ చిన్న నాటి ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా?
పై ఫొటోలో ఉన్న అమ్మాయి అమాయక కళ్లతో చూస్తోంది. కదా.. ఆ కళ్లే ఆమెను స్టార్ ను చేశాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. నటి స్నేహ. వాస్తవానికి స్నేహ తెలుగు గడ్డకు చెందిన అమ్మాయే. ఆమె పూర్వీకులు రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి. కొన్ని కారణాల వల్ల వీరు ముంబైలో నివసించడం వల్ల స్నేహ అక్కడే జన్మించారు. ఆ తరువాత దుబాయ్ వెళ్లడంతో స్నేహ అక్కడే పెరిగారు. కొన్ని రోజుల తరువాత మలయాళ దర్శకుడు పాజిల్ స్నేహ ను చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఆమెను సినిమాల్లోకి తీసుకుంటామని తల్లిదండ్రులకు చెప్పడంతో మొదట వద్దన్నా.. ఆ తరువాత ఓకే చెప్పారు.
అలా స్నేహ 2000 సంవత్సరంలో ‘ఓరు నీల పక్షి’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత స్నేహ కు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అయితే ఈమె ఇండస్ట్రీ లెవల్లో పరిచయం అయింది. దీంతో తెలుగులో గోపీచంద్ పక్కన ‘తొలివలపు’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ప్లాప్ కావడంతో స్నేహను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత తరుణ్ కు జోడిగా ‘ప్రియమైన నీకు’ సినిమాతో స్నేహ ఫేమస్ అయ్యారు. ఆ తరువాత హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు చిత్రాలతో స్నేహా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు స్నేహ. ఈ క్రమంలో తమిళ డైరెక్టర్ ప్రసన్నతో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరిద్దరు 2012 చెన్నైలో వీరు వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని సంవత్సరాల పాటు స్నేహ సినిమాల్లో కనిపించలేదు. దీంతో మిగతా హీరోయిన్ల లాగే స్నేహ సినిమాల నుంచి తప్పుకున్నారని అనుకున్నారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు స్నేహ. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో సైడ్ రోల్ చేసిన స్నేహ ఆ తరువాత ‘వినయ విధేయ రామ’ తదితర చిత్రాల్లో కనిపించారు.
అమె 20 చిత్రాల్లో నటించినా ఎక్కడా గ్లామర్ జోలికి పోలేదు. సాంప్రదాయాన్నే నమ్ముకున్న స్నేహ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో అమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. అందరూ స్నేహ లా ఉండాలని కొందరు కోరుకుంటారు. స్నేహ అందంగా కనిపించడంతో పాటు చక్కటి స్మెల్ ఉండడంతో ఆకర్షిస్తారు. ఏదీ ఏమైనా స్నేహలాంటి హీరోయిన్లను ముందు ముందు చూస్తామా? అని కొందరు చర్చించుకుంటున్నారు.