Heroine Sneha gave clarity on her divorce with husband Prasanna : హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్నతో విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కోలీవుడ్ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. కొన్నాళ్లుగా స్నేహ, ప్రసన్న వేరుగా ఉంటున్నారు. ఇద్దరూ వేరు కాపురాలు పెట్టారనేది ఆ కథనాల సారాంశం. స్నేహ విడాకుల వార్తలు ఆమె అభిమానులను కలవరపెట్టాయి. లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న స్నేహ-ప్రసన్న విడిపోవడమేంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో నిజం లేదని స్నేహ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు చెక్ పెట్టేలా ఇంస్టాగ్రామ్ లో భర్త ప్రసన్నతో దిగిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది. దీంతో విడాకుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టత వచ్చింది.

కోలీవుడ్ నటుడు ప్రసన్నను స్నేహ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012లో పెద్దల సమక్షంలో ఘనంగా వీరి వివాహం జరిగింది. 2009లో స్నేహ-ప్రసన్న కాంబినేషన్ లో అచ్చముండు అచ్చముండు టైటిల్ తో మూవీ తెరకెక్కింది. ఈ మూవీ సెట్స్ లో స్నేహతో ప్రసన్నకు బంధం కుదిరింది. అప్పట్లో స్నేహ-ప్రసన్న మధ్య లవ్ ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్రసన్న ఖండించారు. అలాంటిదేమీ లేదు మేము స్నేహితులం మాత్రమే అని పుకార్లను కొట్టిపారేశారు. అయితే అనూహ్యంగా 2011లో ప్రసన్న-స్నేహ తాము రిలేషన్ లో ఉన్నాము త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు.
2012లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అన్యోన్య దంపతులుగా స్నేహ-ప్రసన్న కాపురం చేస్తున్నారు. పదేళ్ల వైవాహిక జీవితంలో వీరికి ఇద్దరు సంతానం. ఒక అబ్బాయి అమ్మాయికి స్నేహ జన్మనిచ్చారు. మిలీనియం బిగినింగ్ లో స్నేహ స్టార్ గా వెలిగారు. తెలుగులో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
స్నేహ మలయాళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. తెలుగులో స్నేహ మొదటి చిత్రం ప్రియమైన నీకు. తరుణ్ హీరోగా తెరకెక్కిన ప్రియమైన నీకు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. స్నేహ గ్లామర్, క్యూట్ నెస్ కి యూత్ పడిపోయారు. పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన స్నేహ బాలకృష్ణకు జంటగా మహారథి చిత్రం చేశారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీలో వదిన పాత్ర చేశారు.


