https://oktelugu.com/

Shruti Haasan: నెటిజన్ అడిగాడని అక్కడ వెంట్రుకలు ఉన్న ఫోటో షేర్ చేసిన శ్రుతి హాసన్..!

శృతి హాసన్ కెరీర్ గాడిన పడిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య శృతి పరిశ్రమకు దూరమైంది. 2017 తర్వాత ఆమె యాక్టివ్ గా లేరు. 2020లో కమ్ బ్యాక్ ఇచ్చింది. దర్శకుడు గోపి చంద్ మలినేని క్రాక్ రూపంలో సూపర్ హిట్ ఇచ్చాడు. వకీల్ సాబ్ లో గెస్ట్ రోల్ చేసింది.

Written By: , Updated On : August 1, 2023 / 09:39 AM IST
Shruti Haasan

Shruti Haasan

Follow us on

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తరచుగా ఫోటో షూట్స్ చేస్తుంటారు. అలాగే వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తారు. ఆన్లైన్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడాన్ని శృతి హాసన్ బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆమె నెటిజెన్ ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చింది. దాంతో సదరు నెటిజెన్ షాక్ అయ్యాడు. అభిమానుల ప్రశ్నలకు సహనంగా సమాధానం ఇస్తున్న శ్రుతిని, ఓ వ్యక్తి ఆమె పాదాల ఫోటో అడిగారు.

నాకు మీ పాదాలు చూడాలని ఉంది. ఫోటో పెట్టండి అన్నాడు. పాపం సదరు నెటిజెన్ ని నిరాశ పరచకుండా కాళ్లకు వెంట్రుకలతో అందవిహీనంగా ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోను పోస్ట్ చేయడం వెనుక శృతి హాసన్ ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ఆమె రిప్లై సోషల్ ఇండియాలో వైరల్ అయ్యింది. పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Shruti Haasan

Shruti Haasan

ఇక శృతి హాసన్ కెరీర్ గాడిన పడిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య శృతి పరిశ్రమకు దూరమైంది. 2017 తర్వాత ఆమె యాక్టివ్ గా లేరు. 2020లో కమ్ బ్యాక్ ఇచ్చింది. దర్శకుడు గోపి చంద్ మలినేని క్రాక్ రూపంలో సూపర్ హిట్ ఇచ్చాడు. వకీల్ సాబ్ లో గెస్ట్ రోల్ చేసింది. వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం సలార్ మూవీలో నటిస్తుంది. ఆమె షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. శృతి హాసన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ సలార్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ కూడా ఉంది. ఈ విషయాన్ని నటుడు జగపతిబాబు ధృవీకరించారు. కాబట్టి శృతి హాసన్ కి సలార్ 2 లో కూడా ఛాన్స్ దక్కే సూచనలు కలవు. అలాగే ఐ టైటిల్ తో ఒక హాలీవుడ్ మూవీలో శృతి నటిస్తున్నట్లు సమాచారం