Bro Collections: బ్రో మండే టెస్ట్ పాసయ్యాడా? 4వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

నాలుగు రోజులకు బ్రో మూవీ ఇండియా వైడ్ రూ. 71 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. సోమవారం వర్కింగ్ డే భారీగా డ్రాప్ కనిపించింది.

Written By: Shiva, Updated On : August 1, 2023 9:42 am

Bro Collections

Follow us on

Bro Collections: బాక్సాఫీస్ వద్ద బ్రో మూవీ సందడి చేస్తుంది. చెప్పాలంటే బ్రో సినిమాకు పెద్దగా పోటీ లేదు. సోలోగా బాక్సాఫీస్ దున్నేస్తుంది. వీకెండ్ వరకూ బ్రో కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి. మూడు రోజులకు బ్రో వరల్డ్ వైడ్ వంద కోట్ల మార్క్ చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ వంద కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇండియా వరకు చూస్తే ఫస్ట్ డే రూ. 30.05 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు రూ. 17.5, మూడో రోజు రూ. 16.9 కోట్ల వసూళ్లు దక్కాయి. నాలుగో రోజు ఇండియా వైడ్ రూ. 7 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

నాలుగు రోజులకు బ్రో మూవీ ఇండియా వైడ్ రూ. 71 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. సోమవారం వర్కింగ్ డే భారీగా డ్రాప్ కనిపించింది.ఉదయం షోలకు 17.61%, మధ్యాహ్నం 22.31% సాయంత్రం 27.34% ఆక్యుపెన్సీ కనిపించింది. నలుగురు రోజు బ్రో మూవీ వరల్డ్ వైడ్ రూ. 5 నుండి 6 కోట్ల షేర్ రాబట్టే అవకాశం కలదంటున్నారు. నాలుగు రోజులకు బ్రో వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల షేర్ రాబట్టింది ట్రేడ్ వర్గాల అంచనా.

బ్రో తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కింది. అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ఇమేజ్ ఆధారంగా మూల కథలో మార్పులు చేశారు. స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ సమకూర్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక థమన్ సంగీతం అందించారు.

బ్రో జులై 28న విడుదల చేశారు. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ మేనరిజం, ఎనర్జీ, వింటేజ్ లుక్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రాల్లోని పాటలను జోడించడాన్ని ఫ్యాన్స్ పిచ్చగా ఎంజాయ్ చేశారు. ఇది మెగా హీరోల మల్టీస్టారర్ కావడం మరొక విశేషం. అయితే పవన్ రేంజ్ స్ట్రెయిట్ మూవీ పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందని చిత్ర వర్గాలు నమ్ముతున్నాయి.