https://oktelugu.com/

Thandel Movie: ‘తండేల్’ చిత్రానికి సాయి పల్లవి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? నాగ చైతన్య నే మించిపోయిందిగా!

మన సౌత్ ఇండియా లో కొంతమంది హీరోయిన్స్ కి స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉంటుంది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. లేడీ పవర్ స్టార్ అనే టైటిల్ తో ఈమె ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు

Written By: , Updated On : January 30, 2025 / 08:43 PM IST
Follow us on

Thandel Movie: మన సౌత్ ఇండియా లో కొంతమంది హీరోయిన్స్ కి స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉంటుంది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. లేడీ పవర్ స్టార్ అనే టైటిల్ తో ఈమె ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ’ అనే డ్యాన్స్ షో ద్వారా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె, నేడు దేశవ్యాప్తంగా కల్ట్ ఫ్యాన్ బేస్ ని దక్కించుకున్న హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తమ అందచందాలను చూపించి సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్న హీరోయిన్స్ ఉన్న ఈరోజుల్లో, తన టాలెంట్ తో అవకాశాలు సంపాదిస్తూ ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందడం అనేది సాధారణమైన విషయం కాదు. గత ఏడాది ‘అమరన్’ చిత్రం తో సౌత్ ఇండియా షేక్ అయ్యే రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టి, నటన పరంగా కూడా మంచి మార్కులు తెచ్చుకున్న సాయి పల్లవి, ఫిబ్రవరి 7న ‘తండేల్’ చిత్రంతో మరోసారి మన ముందుకు రాబోతుంది.

ఈ చిత్రానికి యూత్ ఆడియన్స్ లో ఇంత మంచి క్రేజ్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి పాటలు అయితే, మరొక కారణం సాయి పల్లవి అని చెప్పొచ్చు. ఇందులో నాగ చైతన్య ని తగ్గించే ఉద్దేశ్యం ఎవరికీ లేదు కానీ, ఆయన గత చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అవ్వడం వల్ల, ఆడియన్స్ లో నాగ చైతన్య సినిమాలకు కాస్త క్రేజ్ దక్కింది. అదే సమయంలో సాయి పల్లవి ఒక సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు అంగీకారం తేలిందంటే, కచ్చితంగా ఆ చిత్రంలో మంచి కంటెంట్ ఉండే ఉంటుంది అని ప్రేక్షకులు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతున్నారు. అలా ఫిక్స్ అవ్వడం వల్లే నేడు ‘తండేల్’ చిత్రానికి ఇంత క్రేజ్ రావడంలో ఒక కారణంగా మారింది సాయి పల్లవి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

‘అమరన్’ చిత్రానికి కేవలం మూడు కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకున్న సాయి పల్లవి, ‘తండేల్’ చిత్రానికి ఏకంగా ఆరు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం లో హీరోగా నటించిన నాగ చైతన్య కేవలం 5 కోట్లు మాత్రమే తీసుకోవడం గమనార్హం. మిగతావి సినిమా సూపర్ హిట్ అయితే లాభాల్లో కాస్త వాటా ఇస్తానని నిర్మాత అల్లు అరవింద్ నాగ చైతన్య కి మాట ఇచ్చాడట. సాయి పల్లవి కి ఎందుకు అంత రెమ్యూనరేషన్ అంటే, ఆమెకి తెలుగు తో పాటు తమిళం, మలయాళం లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకి ఆ భాషల్లో టికెట్స్ తెగితే అది సాయి పల్లవి కారణంగానే అని చెప్పొచ్చు. అందుకే ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ సినిమా హిట్ అయితే ఆమె రెమ్యూనరేషన్ పది కోట్ల రూపాయలకు ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు.