Seeman : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. కొత్తగా టీవీకే పార్టీని పెట్టి విజయ్ రంగంలోకి వచ్చాడు. కొత్తగా ఇంకో పరిణామం జరిగింది. సీమాన్ అనే కమెడియన్ ‘ఎన్టీకే’ అనే పార్టీని పెట్టాడు. 2024 లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 8.3 శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. ఈయన బేసికల్ గా ద్రవిడియన్ ఐడియాలజీ నుంచి వచ్చిన వ్యక్తి. పెరియార్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పెరియార్ ను తమిళనాట గాడ్ గా చూస్తారు. అటువంటి పెరియార్ ను సీమాన్ ఉతికి ఆరేస్తున్నాడు. తమిళ భాష అంటే గౌరవం లేని వ్యక్తి ఎవరైనా ఉంటే పెరియార్ అని.. మహిళల విషయంలో అసభ్యంగా పెట్టుకున్నాడని.. కూతురులాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.. ఆయన హిందీ వ్యతిరేకి అని అంటూ ఆడిపోసుుకున్నాడు. ఇది చోళుల భూమి, పాండ్యన్ ల భూమి అని.. ఇది పెరియార్ భూమి కాదని విమర్శలు గుప్పిస్తున్నాడు.
2016లో ఒక్క శాతం ఓట్లు వస్తే.. 2021లో 6 శాతం.. పార్లమెంట్ కు 8 శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. ఈయన తమిళవాదం కావాలని.. సపరేట్ దేశం కావాలంటూ ఈయన ప్రమాదకరంగా తయారయ్యాడు.
ద్రవిడ వాదంపై తిరుగుబాటు ప్రకటించిన సీమాన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.