Heroine Sadha: ట్రెండ్ ఫాలో అవుతున్న సదా గ్లామర్ షోకి తెరలేపింది. ఒకప్పటి ఈ హోమ్లీ హీరోయిన్ సరికొత్తగా అందాల ప్రదర్శిస్తుంది. మిలీనియం బిగినింగ్ లో సదా కుర్రాళ్లను ఊపేసింది. ఆమె డెబ్యూ మూవీ జయం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వందల రోజులు థియేటర్స్ లో ఆడింది. దర్శకుడు తేజ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ జయం తెరకెక్కించారు. హీరో నితిన్ సైతం ఇదే మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. 2002లో విడుదలైన జయం సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. లంగా ఓణీలో వెళ్ళవయ్యా వెళ్ళు అని ఆమె చెప్పిన డైలాగ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్.
ఆ దెబ్బతో తెలుగు తమిళ భాషల్లో సదాకు అవకాశాలు క్యూ కట్టాయి. టాప్ స్టార్స్ తో సైతం అవకాశాలు దక్కాయి. అయితే ఆ టెంపో కొనసాగించడంలో సదా ఫెయిల్ అయ్యింది. ఎన్టీఆర్, బాలకృష్ణ, విక్రమ్ వంటి టాప్ స్టార్స్ తో నటించిన సదా టైర్ టూ హీరోలకు పడిపోయింది. వరుస పరాజయంతో ఫేడ్ అవుట్ అయ్యింది. కొన్నాళ్ళు సదా సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది.
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. హీరోయిన్ గా పరిచయం చేసిన తేజా ఆమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇటీవల విడుదలైన అహింస చిత్రంలో సదా కీలక రోల్ చేసింది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమైన అహింస పూర్తిగా నిరాశపరిచింది. తేజా అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పట్టింది. అహింస ప్లాప్ కాగా సదా అంత ఫోకస్ కాలేదు.
మరోవైపు బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. ఆ మధ్య బిగ్ బాస్ జోడీ షోకి జడ్జిగా వ్యవహరించింది. బీబీ జోడీ ముగియగా ఇటీవల నీతోనే డాన్స్ పేరుతో మరో షో స్టార్ట్ అయ్యింది. తరుణ్ మాస్టర్, హీరోయిన్ రాధతో పాటు సదా జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్న సదాకు పెళ్లి ఆలోచన లేదట. వివాహం వలన స్వేఛ్చ ఉండని ఆమె అంటున్నారు. పైగా తనకు వైల్డ్ లైఫ్ అంటే ఇష్టం. జంతు ప్రేమికురాలిగా ఇలా జీవితం ఒంటరిగా గడిపేస్తా అంటున్నారు.
View this post on Instagram