Rashmika Mandanna: సౌత్ ఇండియా లో ఇప్పుడు భారీ పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు రష్మిక మందనా..టాలీవుడ్ లో చలో అనే సినిమా తో ప్రారంభమైన ఈమె కెరీర్ మనం చూస్తూ ఉండగానే ఏ రేంజ్ కి ఎదిగిపోయిందో మన అందరికి తెలిసిందే..తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడం తో ఈమెతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్లు క్యూ కట్టారు..ఇక రెండవ సినిమా గీత గోవిందం చిత్రం ఈమె కెరీర్ నే మలుపు తిప్పేసింది చెప్పొచ్చు..అందం తో మాత్రమే కాకుండా నటన తో కూడా ఆమె ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది..అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లో రష్మిక కి మరియు హీరో విజయ్ దేవరకొండ కి మధ్య పెద్ద గొడవే జరిగిందట..అప్పట్లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే.

మూవీ టీం మొత్తం ఒక్క సన్నివేశం కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారట..అయినా కూడా ఆ సన్నివేశాలు లీక్ అవ్వడం తో హీరో విజయ్ దేవరకొండ రష్మికా ని అనుమానించాడట..నువ్వు ఏమైనా మీ స్నేహితులకు వీడియో వాట్సాప్ చేసావా అని అడగడం తో రష్మిక కి బాగా కోపం వచ్చి లొకేషన్ లోనే పెద్ద గొడవలు వేసుకుందట..ఈ గొడవ దెబ్బకి షూటింగ్ కూడా రెండు రోజుల వరుకు ఆగిపోయింది..ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చొరవ తీసుకొని ఈ మేటర్ ని సెటిల్ చేసాడట.

డైరెక్టర్ పరశురామ్ కూడా ఈ వీడియోలు లీక్ అవ్వడం లో నీ ప్రమేయం ఏమి లేదు ఎక్కడో ఎదో పొరపాటు జరిగింది అని ఆమెని కూల్ చెయ్యడం తో మిగిలిన షూటింగ్ ని పూర్తి చేశారట..ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక ఏ రేంజ్ స్నేహితులు అయ్యారో మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి..గీత గోవిందం సినిమా తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో కూడా నటించారు.