Mahesh Babu- Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ మంచి ఊపు మీదున్న ఏకైక హీరో అని మన అందరికి తెలిసిందే..మాములు సినిమాని కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని చేసి వంద కోట్ల షేర్ ని అవలీల గా కొట్టగలిగే కెపాసిటీ ఉన్న హీరో..అలాంటి హీరో టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారితో సినిమా చేస్తే ట్రేడ్ లో బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పైగా మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే కేవలం మహేష్ అభిమానులకు మాత్రమే కాదు..ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టం..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు కొన్ని కారణాల వల్ల థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా..టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి..ఇప్పటికి ఈ సినిమాలు టీవీ లో వచ్చిందంటే మంచి TRP రేటింగ్స్ వస్తూనే ఉంటాయి..అలాంటి కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంబించుకుంది.

రామోజీ ఫిలిం సిటీ లో వేసిన విలేజ్ సెట్ లో ఒక్క భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఈ మొదటి షెడ్యూల్ లో తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్..అయితే ఈ మొదటి షెడ్యూల్ లో జరిగిన షూటింగ్ ఔట్పుట్ మీద మహేష్ బాబు అసంతృప్తి తో ఉన్నాడట..ఇక అసలు విషయానికి వస్తే KGF వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్స్ అంబు అరివు ని ఈ సినిమా కోసం పెట్టుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్..వారం రోజుల పాటు చిత్రీకరించిన ఈ యాక్షన్ సన్నివేశం ఔట్పుట్ ని చూసిన మహేష్ త్రివిక్రమ్ ముందు తన అసంతృప్తి ని తెలిపాడట.

ఫైట్స్ అసలు ఏ మాత్రం బాగోలేవని..వెంటనే ఫైట్ మాస్టర్స్ ని మార్చి మళ్ళీ రీ షూట్ చెయ్యమని చెప్పాడట మహేష్..ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఔట్పుట్ విషయం లో మహేష్ బాబు ఎక్కడా కూడా తగ్గడం లేదట..ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని చూసిన తర్వాతే ఈ సినిమా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానెర్ పై సూర్య దేవర నాగ వంశి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.