Rashmika Mandana : ఎప్పుడూ నవ్వుతూ ఎంతో చలాకీగా తిరుగుతూ కనిపించే హీరోయిన్ రష్మిక మందన, అకస్మాత్తుగా నేడు విమానాశ్రయం లో వీల్ చైర్ పై కనిపించడం ఆమె అభిమానులను భయబ్రాంతులకు గురి చేసింది. కార్ నుండి కుంటుకుంటూ ఆమె వీల్ చైర్ మీద కూర్చుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వీల్ చైర్ ని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది?, అంత పెద్ద ప్రమాదం రష్మిక కి ఏమి జరిగింది అని ఆరా తీశారు అభిమానులు. అలా ఆరా తీయగా తెలిసింది ఏమిటంటే సికందర్ మూవీ షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, రష్మిక కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయి. దీంతో ఆమెని వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. డాక్టర్ల సలహా మేరకు కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో రష్మిక గత రెండు వారల నుండి బెడ్ కి పరిమితమైందట.
ఈ కారణంగా చేత సికందర్ మూవీ షూటింగ్ కూడా తాత్కాలికంగా ఆగిపోయింది. సల్మాన్ ఖాన్ హీరో గా తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ కి సుమారుగా 60 మిలియన్ కి పైగా వ్యూస్, 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. రష్మిక కి బాలీవుడ్ లో ఇది రెండవ చిత్రం. ఆమె మొదటి చిత్రం ‘ఎనిమల్’ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా హిట్ తర్వాత రష్మిక కి టాలీవుడ్ లో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు ఆమె విక్కీ కౌశల్ తో కలిసి చావా అనే హిస్టారికల్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది.
పుష్ప సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించుకున్న రష్మిక, పాన్ ఇండియన్ హీరోయిన్స్ లో ఒకరిగా, అత్యధిక రెమ్యూనరేషన్ ని అందుకుంటూ ఎవ్వరికీ అందనంత దూరం లో ఉంది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి ఎలాంటి పేరు వచ్చిందో, రష్మిక కి కూడా అంత మంచి పేరొచ్చింది. బాలీవుడ్ లో ఆమెకి ఈ చిత్రానికి ముందే ‘ఎనిమల్’ ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పుష్ప 2 ఆమె క్రేజ్ పదింతలు ఎక్కువ అయ్యింది. మంచి స్పీడ్ మీద దూసుకుపోతున్న ఈ సమయంలో ఆమెకి ఇలా జరగడం శోచనీయం. ఆమె తొందరగా రీకవర్ అయ్యి మళ్ళీ సినిమా షూటింగ్స్ లో చురుగ్గా పాల్గొనాలని ఆశిద్దాం.
Get Well Soon @iamRashmika ❤️ pic.twitter.com/P3HN8uaUYK
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 22, 2025