https://oktelugu.com/

Samantha : రహస్యంగా రెండవ పెళ్లి కార్యక్రమాలను మొదలెట్టిన సమంత..ఆధారాలతో సహా దొరికిపోయిందిగా!

సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో ఉండే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత(Samantha Ruth Prabhu) పేరు కచ్చితంగా ఉంటుంది.

Written By: , Updated On : February 18, 2025 / 02:05 PM IST
Samantha

Samantha

Follow us on

Samantha : సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో ఉండే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత(Samantha Ruth Prabhu) పేరు కచ్చితంగా ఉంటుంది. ఏ హీరోయిన్ పేరు అయినా వాళ్ళ సినిమాలు విడుదలకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ట్రెండ్ అవుతూ ఉంటుంది. కానీ సమంత పేరు మాత్రం సినిమాలు దగ్గరలో విడుదలకు ఉన్నా లేకపోయినా ట్రెండింగ్ లోనే ఉంటుంది. అది ఆమె రేంజ్. ముఖ్యంగా నాగ చైతన్య ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా వాళ్ళు విడిపోవడం వంటివి జరిగిన తర్వాత సమంత పేరు ఇంకా గట్టిగా మారుమోగిపోయింది. నాగ చైతన్య(Akkineni Nagachaitanya) శోభిత(Sobhitha Dhoolipalla) ని రెండవ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని తాను చూసుకోగా, సమంత మాత్రం ఇప్పటికీ సోలో జీవితాన్నే కొనసాగిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె రెండవ పెళ్లి పై ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తన మనసులో ఉన్న ఆలోచనలను సమంత ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే రీసెంట్ గా ఆమె పెడుతున్న పోస్టులను చూసి, కచ్చితంగా ఈమె రెండవ పెళ్లిపై మొగ్గు చూపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గా ఆమె తెల్లని దుస్తులు ధరించిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ‘నిన్ను ప్రేమించాలంటే నాకు భయం వేస్తుంది. జీవితాంతం ఇలాగే నా చెయ్యి పట్టుకొని ఉండగలవా?’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేవలం ఇదొక్కటే కాదు, వాలెంటైన్స్ డే రోజున ఆమె అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలను చూస్తే, కచ్చితంగా ఈమె ఎవరితోనో రిలేషన్ ని మైంటైన్ చేస్తుంది అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. గత కొంతకాలం నుండి ఆమె ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అతనితో కలిసి సమంత ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, పబ్బుల్లో కనిపించడం వంటివి బాలీవుడ్ మీడియా తమ కెమెరాలతో బంధించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో యాంకర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘జీవితాంతం ఇలాగే సింగిల్ గా మిగిలిపోతారా?’ అని అడగగా, దానికి సమంత ‘నో’ అని సమాధానం చెప్తుంది. అంటే రెండవ పెళ్లి పై ఆమె అమితాసక్తిని చూపిస్తుంది అనే అనుకోవాలి. ఇదే కనుక జరిగితే ఆమె అభిమానులు ఎంతో ఆనందిస్తారు. ఇప్పటి వరకు సోలో గా సమంత పెద్ద యుద్ధమే చేసింది. మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధిని ఒంటరిగా పోరాడి గెలిచి, మళ్ళీ మన ముందుకు క్షేమంగా వచ్చింది. ఏ ఆడపిల్ల జీవితంలో అయినా విడాకులు అనే వ్యవహారం నరకప్రాయం. ఎన్నో అవమానాలను సమాజం లో ఎదురుకోవాలి. సమంత వాటిని ఎదురుకొని ఎన్నో లక్షల మంది మహిళలకు ఆదర్శంగా నిల్చింది. భవిష్యత్తులో ఆమె జీవితం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.