Priyamani: ప్రియమణికి ‘యమదొంగ’ సినిమా తర్వాత బబ్లీ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె డేట్లు కోసం అప్పట్లో చాలామంది దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ తిరిగారు. అయితే, ఇక్కడే పొరపాటు చేసింది ప్రియమణి. ఆ సమయంలో తనకొచ్చిన స్టార్ డమ్ ని క్యాష్ చేసుకోవాలని ఉబలాట పడింది. వచ్చిన ప్రతి చిన్నాచితకా సినిమా ఒప్పేసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ ను ఫుల్ గా నింపేసుకుంది. కానీ.. సినిమాల ఎంపికలో ఆమెకు క్లారిటీ లేదు. ఆమె తెలియని తన్నాని ఓ నిర్మాత తనకు అనుకూలంగా వాడుకోవాలని చూశాడు. దాంతో ప్రియమణి బాగా ఇబ్బందులు పడింది.

ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ప్రియమణి హీరోయిన్‌గా ఓ సినిమా షూటింగ్ మొదలై సగం షూటింగ్ అయిపోయిన తర్వాత.. ఓ రొమాంటిక్ సీన్ కోసం బికినీ వేయాలని బలవంతం చేశాడట. పైగా బికినీతో పాటు బొడ్డు దగ్గర టాటూ కూడా వేయించుకోవాలని ప్రియమణి వేధించాడట. ఆమె వద్దు అని కన్నీళ్లు పెట్టుకున్నా వదలలేదు అట. ఆమె చేత బికినీ వేయించి, అతనే బలవంతంగా ప్రియమణి బొడ్డు పై టాటూ వేశాడట. ఆ నిర్మాత ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉన్నాడు. కానీ.. అంతా పోగొట్టుకుని ఖాళీగా తిరుగుతున్నాడు.
Also Read: AP BJP: పొత్తు జనసేనతో..ఉండేది వైసీపీతో.. ఏపీలో బీజేపీ డబుల్ గేమ్
ఇక ప్రియమణికి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మెన్’తో ఆమె కెరీర్ కు మళ్ళీ ఊపు వచ్చింది. నిజానికి ప్రియమణి టాలెంటెడ్ నటి. ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందిన నటి. కాలం కలిసి రాక, ప్రియమణికి స్టార్ డమ్ ఎక్కువ కాలం నిలబడలేదు. పైగా హీరోయిన్ గానూ ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. కాకపోతే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ మంచి రోల్స్ వస్తున్నాయి. అయితే, హీరోయిన్ గా చేసిన తప్పులను ఇప్పుడు చేయకుండా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.
నిజానికి హీరోయిన్ గా కూడా ప్రియమణి కెరీర్ ను చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. తెలుగులో తనకు హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చేవాళ్ళు కరువయ్యారు అని అర్ధం కాగానే.. హీరోయిన్ గా కన్నడంలోకి వెళ్ళింది. మధ్యలో తమిళంలో కూడా బాగానే కష్టపడింది. మొత్తానికి అన్నీ భాషల్లో హీరోయిన్ గా గుర్తింపును కోల్పోయాక ఇక చేసేది ఏమి లేక సైలెంట్ గా పెళ్లి చేసుకుని.. డీసెంట్ గా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కానీ, ఈ లోపు ఓ టీవీ షో వచ్చింది. అంతే.. అన్నీ వదిలేసి ఆ షో చేసింది. ఎలాగూ టీవీ షోలు కూడా చేస్తోంది కాబట్టి.. సీనియర్ హీరోల పక్కన కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. దాంతో, ప్రియమణికి మళ్లీ కొంతవరకు డిమాండ్ క్రియేట్ అయింది.

ముఖ్యంగా నారప్పతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అందుకే, ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోనూ నటిస్తూ భారీగానే అందుకుంటూ ముందుకు పోతుంది. అయినా డబ్బు మీద ఆశ మాత్రం ఈ ముదురు భామకు ఇంకా చావట్లేదు. . ‘ఫ్యామిలీ మెన్’తో హిందీలో బాగా డిమాండ్ పెరిగింది. అందుకే.. అక్కడ తనకు వచ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. వరుసగా హిందీ వెబ్ సిరీస్ లు చేస్తోంది.
ఈ క్రమంలో ప్రియమణి అవమానాలు కూడా బాగానే ఎదుర్కొంది. ‘కర్ర ఆంటీ’, ‘ఫ్యాట్ పిగ్’ అని కొందరు ఆకతాయిలు ఆన్ లైన్లో ఆమెను వేధించారు. ప్రియమణికి రంకు తక్కువ అయినా, తన అందచందాలతో ఓ ఊపు ఊపింది. కొందరు నెటిజన్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇక ప్రియమణి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ‘ముస్తాఫా రాజ్’ని ఆమె పెళ్లి చేసుకుని బెంగళూరులోనే సెటిల్ అయింది.