https://oktelugu.com/

ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ రెడీ..!

కరోనా వైరస్ ఏపీని వణికించింది.  వైరస్ పాజిటివ్ కేసుల్లో ఏపీ  రెండో స్థానంలో ఉండడంతో  ఇక్కడ వైరస్ ఏ స్థాయిలో విస్తరించిందో అర్థమవుతోంది. అయితే ప్రభుత్వం జాగ్రత్తలను వివరించినా.. సరైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన పాజిటివ్ కేసులు మాత్రం ఆగలేదు. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంది. అయితే కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అది వచ్చేదాకా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. మరోవైపు వ్యాక్సిన్ కూడా సిద్ధంగా ఉందని పంపిణీకి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 7:28 pm
    Follow us on

    CM Jagan

    కరోనా వైరస్ ఏపీని వణికించింది.  వైరస్ పాజిటివ్ కేసుల్లో ఏపీ  రెండో స్థానంలో ఉండడంతో  ఇక్కడ వైరస్ ఏ స్థాయిలో విస్తరించిందో అర్థమవుతోంది. అయితే ప్రభుత్వం జాగ్రత్తలను వివరించినా.. సరైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన పాజిటివ్ కేసులు మాత్రం ఆగలేదు. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంది. అయితే కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అది వచ్చేదాకా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. మరోవైపు వ్యాక్సిన్ కూడా సిద్ధంగా ఉందని పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది.

    Also Read: ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..?

    తాజాగా ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. కరోనా టీకా పంపిణీ చేసేందుకు మంగళవారం రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరుణంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

    Also Read: దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలి: ఏపీ ప్రభుత్వం

    ప్రస్తతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఇంకా విజ్రుంభిస్తూనే ఉంది. రోజు వేలల్లో కేసులు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే అంతకుముందున్న భయం ఇప్పట్లో కనిపించడం లేదు. ఓ వైపు కరోనా తీవ్రత తగ్గుతుందని ప్రచారం జరుగుతుండడంతో పాటు వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నయాని వార్తలు రావడంతో ప్రజలు జాగ్రత్తలను మరిచిపోయారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఈ తరునంలో వ్యాక్సిన్ వస్తుందన్న వార్తలతో ప్రజలు  మరింతగా  జాగ్రత్తలు  మరిచిపోతారని వైద్య నిపుణులు అంటున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ముందుగా ఎవరికి ఇస్తారన్న చర్చ సాగుతోంది. ఈ మధ్యలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం తప్పదని కోవిడ్ నిపుణులు పేర్కొంటున్నారు.