Niharika Konidela
Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. ఒక మనసు చిత్రంతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీలో నిహారిక నటనకు మార్కులు పడ్డాయి. ట్రాజిక్ లవ్ డ్రామా కావడంతో కమర్షియల్ గా ఆడలేదు. ఈ చిత్రంలో నిహారికకు జంటగా నాగ శౌర్య నటించారు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించింది. అలాగే ఒకటి రెండు తమిళ చిత్రాలు చేసింది. పెదనాన్న చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిలో చిన్న గెస్ట్ రోల్ చేసింది.
అయితే నిహారికకు బ్రేక్ రాలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోతే చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది ఒప్పందం అట. అందుకే నాగబాబు కుదిర్చిన సంబంధానికి నిహారిక ఒప్పుకుంది. 2020 డిసెంబర్ నెలలో నిహారిక-వెంకట చైతన్యల వివాహం జరిగింది. అయితే నిహారిక ఇటీవల విడాకులు తీసుకున్నారు. పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు నిహారిక తెలియజేసింది.
నిహారిక రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల డెడ్ ఫిక్సెల్స్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. ఇది వీడియో గేమ్ ప్రధానంగా సాగే రొమాంటిక్ లవ్ డ్రామా. హోస్ట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. డెడ్ ఫిక్సెల్ పర్వాలేదు అనిపించుకుంది. అలాగే సొంతగా ఆఫీస్ ఓపెన్ చేసింది. యువ దర్శకులు, రచయిలతో నిహారిక చర్చలు జరుపుతుంది. నిర్మాతగా చిన్న చిత్రాలు, సిరీస్లు తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తుంది. నిహారికకు పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ ఉంది.
విడాకులు అనంతరం పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టింది. మరలా హీరోయిన్ గా ఎదగాలనేది నిహారిక కోరిక. అందుకే గ్లామరస్ ఫోటో షూట్స్ తో హీటెక్కిస్తోంది. నిహారిక బోల్డ్ అవతార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు వరుణ్ తేజ్ పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. ఒకటి రెండు నెలల్లో వివాహం జరగొచ్చని సమాచారం. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. కొన్నాళ్ళు ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.