Nidhi Aggarwal : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ ని మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే జానర్ సినిమాలు చేయడం చూసాము. మొట్టమొదటిసారి ఈ చిత్రం ద్వారా ఆయన పీరియాడిక్ జానర్ లో కనిపించబోతున్నాడు. ఈ జానర్ లో పవన్ కళ్యాణ్ ఎలా నటించబోతున్నాడు?, ఆయన డైలాగ్స్ ఎలా అనబోతున్నాయి? అనే అంశంపై కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు గ్లిమ్స్ వీడియోస్, ఒక టీజర్ తో పాటు, ‘మాటవినాలి’ అనే సాంగ్ కూడా విడుదల చేసారు. వీటికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా కంటెంట్ సరిగ్గా జనాలకు తెలిసేలా ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా విడుదల చేయలేదని అభిమానుల్లో చిన్న అసంతృప్తి ఉంది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం నుండి రెండు వారాలకు ఒక కంటెంట్ వస్తుందని, అభిమానులు సంబరాలకు సిద్ధం అవ్వాల్సిందే అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ సీనియర్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. వాటిని అభిమానులు బాగా షేర్ చేస్తూ వైరల్ చేయడంతో నిర్మాతల వరకు చేరింది. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటని ఫిబ్రవరి 14 న విడుదల చేయబోతున్నట్టు ఒక వార్త వినిపించింది. ఇది బాగా వైరల్ అవ్వడం తో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ కామెంట్స్ చేస్తూ ‘సోషల్ మీడియా లో హరి హర వీరమల్లు పాట గురించి ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి మూవీ టీం చెప్పే వరకు ఏది నమ్మకండి’ అంటూ ఆమె ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసింది.
సాధారణంగా ఇలాంటి ట్వీట్స్ నిర్మాతలు తమ వ్యక్తిగత అకౌంట్స్ నుండి వేయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం హీరోయిన్ తో వేయించడం చర్చనీయాంశం అయ్యింది. 90 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కేవలం 5 రోజుల షూటింగ్ ని మాత్రమే బ్యాలన్స్ ఉంచుకుంది. పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం నిర్మాతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయితే, ముందు అనుకున్నట్టుగానే మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. లేదంటే ఏప్రిల్, లేదా మే నెలకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గానే బాబీ డియోల్ మీద అన్నపూర్ణ స్టూడియోస్ లో కొన్ని కీలక సన్నివేశాలు చేసారు. VFX కి సంబంధించిన వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. మార్చి 28 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల అవుతుందో లేదో చూడాలి మరి.
Hello my twitter fam! Pls don’t believe release and song speculations online.. wait for production update only good times are coming ♾️
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) February 1, 2025