Taman
Taman : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని చవిచూసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి రామ్ చరణ్ తన వైపు నుండి అన్ని విధాలుగా ది బెస్ట్ ఇచ్చాడు, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో అయితే ఆయన చేసిన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడేళ్ళ పాటు ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వకుండా, తన పూర్తి సమయాన్ని ఈ చిత్రానికే కేటాయించాడు. కానీ ఫలితం వికటించింది. రామ్ చరణ్ కెపాసిటీ ని డైరెక్టర్ శంకర్ ఉపయోగించుకోలేకపోయాడు. స్క్రీన్ ప్లే మీద పెట్టిన శ్రద్ద, కథ, హీరోయిజం మీద పెట్టి ఉండుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేదని, మంచి కాన్సెప్ట్ ని శంకర్ తన నాసిరకమైన టేకింగ్ తో నాశనం చేశాడని అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేశాడు.
ఈ సినిమాకి రామ్ చరణ్ తర్వాత ది బెస్ట్ ఔట్పుట్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారా అంటే అది సంగీత దర్శకుడు తమన్ అని చెప్పొచ్చు. సినిమాలో కంటెంట్ పెద్దగా లేదు, అయినప్పటికీ కూడా తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పైకి లేపే ప్రయత్నం చేశాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో అనే సన్నివేశాలకు ఆయన అదిరిపోయే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు. అవన్నీ ఒక ఓఎస్టీ గా చేసి నిన్న విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ టెక్నికల్ సమస్యల వల్ల ఆయన విడుదల చేయలేకపోయాడు. దానికి ఆయన ట్వీట్ వేస్తూ ‘రామ్ చరణ్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్తున్నాను. టెక్నికల్ సమస్యల కారణంగా ఈరోజు OST ని విడుదల చేయలేకపోతున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తాము’ అంటూ నిన్న ఒక ట్వీట్ వేశాడు.
అంటే ఈరోజు సాయంత్రం నుండి తన యూట్యూబ్ ఛానల్ లో ఈ OST లైవ్ అవ్వబోతుంది అన్నమాట. తమ సినిమా గురించి శ్రద్ద తీసుకొని స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ తమన్ ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతనే నాకు సంబంధం లేదంటూ ఈ సినిమాని పట్టించుకోవడం మానేస్తే, తమన్ పనిగట్టుకొని OST ని సిద్ధం చేసి విడుదల చేస్తుండడం అభినందించాల్సిన విషయమే. ఇది ఇలా ఉండగా ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం, శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తో రామ్ చరణ్ ఊర మాస్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Sorry GuyS Was Running late Wit Ost JukeBox & technical stuffff
Tom 6:03 pm tat is Feb 2nd 6:03 pm #GameChangerOst Will be Live @saregamasouthA dozen of tracks To Doze u off into a different Vibe ❤️
The Soul of #Appanna is My Pick ❤️
See you all Tom #GameChanger ‘S…
— thaman S (@MusicThaman) February 1, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Taman apologized to ram charans fans for game changer tweet going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com