Sampath Nandi: ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నప్పటికి సంపత్ నందికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి… రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలతో తన మార్క్ ఏంటో చూపించాడు. ఇక అలాంటి సంపత్ నంది తన తండ్రిని కోల్పోయిన ఆవేదనలో తన బాధను కవిత్వం రూపంలో తన అభిమానులతో, ప్రేక్షకులతో పంచుకునే ప్రయత్నం చేశాడు… వాళ్ల నాన్న ను గుర్తు చేసుకుంటూ
బాపు ఇక నువ్వు లేకుండానే రేపు, ఎల్లుండి జీవితమంతా…
నువ్వు లేకుండానే తెల్లారింది…
నువ్వ లేకుండానే ఓదెల లేచింది…
నువ్వు లేకుండానే ఇల్లు లేచింది…
కళ్ళాపి తో తడవాల్సిన వాకిలి కన్నీటి తో తడిచింది…
అంటూ ఆయన తన భావోద్వేగాన్ని తెలియజేశాడు. మొత్తానికైతే సంపత్ నంది సినిమాల్లో రచయిత గా పేరు సంపాదించుకోవడమే కాకుండా తన ఎమోషన్ ను కూడా ప్రేక్షకులతో ఇలా పంచుకోవడం అనేది చాలా ఆవేదనను కలిగించే విషయమనే చెప్పాలి…
కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ నాన్న ఈరోజు తుది శ్వాసను విడిచి అనంత లోకాలకు వెళ్లిపోవడం అనేది అతని అభిమానులను సైతం తీవ్రంగా బాధిస్తోంది…ఇక రీసెంట్ గా సంపత్ నంది ‘ఓదెల 2’ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది…
దాంతో సంపత్ వాళ్ళ నాన్న మృతి పట్ల చాలామంది సినిమా ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేశారు…ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అతి కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లలో సంపత్ నంది మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి అతని సినిమాల్లో ఒక సోల్ ఉంటుందని, అతని డైలాగులకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తుందని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం విశేషం…
ఇక ఫ్యూచర్లో సైతం ఆయన గొప్ప సినిమాలు చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తానని గతంలో చెప్పిన మాటలను తన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనకు కలిగిన బ్యాడ్ సిచ్యుయేషన్ నుంచి వీలైనంత తొందరగా కోలుకుంటే మంచిదని చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…