Hereoine Laya: అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ లలో లయ ఒకరు. తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. లయ తన కెరీర్ బిగినింగ్‌లో అందాల ఆరబోతకి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య తరహాలో కేవలం అభినయంతోనే మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. పైగా లయ ఎప్పుడు చక్కని కట్టు బొట్టుతో ఫ్యామిలీ హీరోయిన్ లానే కనిపించేది.

తన హోమ్లీ లుక్స్ తోనే కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది. వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే తన సినీ కెరీర్ కి బ్రేక్ ఇచ్చేసింది. లయ ఇన్నాళ్లు వైవాహిక జీవితానికే అంకితమైపోయింది. ఐతే, ఇన్నేళ్ళ తర్వాత ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ రాణించాలని ఆశ పడుతుంది.
Also Read: Trivikram-Mahesh Babu Movie: మహేష్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్ పై ఫాన్స్ కి అదిరిపోయ్యే న్యూస్
అందుకే తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ క్యూట్ లుక్స్ పోస్ట్ చేసింది. నాలుగు పదుల వయసులోకి చేరిన లయ తాజాగా ఆకుపచ్చ డ్రెస్ లో అందాల ఆరబోతతో దర్శనమిచ్చింది. ఇలాంటి హీరోయిన్ని బోల్డ్ పాత్రల్లో ఉహించుకోలేం. కానీ, లయ ఎలాగైనా రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని భావిస్తోంది. పెద్ద చిత్రాల్లో అవకాశాల కోసమే మునుపెన్నడూ లేని విధంగా ఇలా గ్లామర్ షోకు రెడీ అవుతుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా తరచుగా తన అందాల ఆరబోతతో కూడిన ఫోటో షూట్లు కూడా చేయాలని లయ ప్లాన్ చేస్తోందట. మొత్తానికి లేటు వయసులో లయ కూడా కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యింది. లయ నుంచి ఈ తరహా హాట్ పిక్స్ ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే లయ, అవకాశాల కోసం పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు సంప్రదించింది. మరి రానున్న రోజుల్లో లయ ఎలాంటి పాత్రలు చేస్తోందో చూడాలి.
మొత్తానికి వరుస ఫోటో ఘాట్ లతో లయ చెలరేగిపోతుందట. మరి లయ తన రీ ఎంట్రీ సత్తా చాటాలని ఆశిద్దాం. పెద్ద చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రావాలని కోరుకుందాం.
Also Read:Rajanna Movie Child Artist: రాజన్న మూవీలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
View this post on Instagram
Recommended Videos
[…] […]