Study : ఇంకా చదువుతున్నారా? ఇలా అయితే మీ చదువులు దండగే..

మీ చదువు ఏదైనా సరే ఆ చదువుకు సంబంధించిన పూర్తి పని ఇంట్లో అవ్వాల్సిందే. అప్పుడే మీ చదువుకు పూర్తి న్యాయం జరిగినట్టు. లక్షలు పెట్టి చదివిన చదువుకు ప్రయోజనం చేకూరినట్లు అంటారు నిపుణులు. మరి మీ చదువు వల్ల మీకు ఎంత వరకు లాభం, ప్రయోజనం చేకూరాయో ఒకసారి మీరే ఆలోచించండి.

Written By: NARESH, Updated On : April 23, 2024 3:40 pm

studies are in vain

Follow us on

Study : చదువు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చదువుకోవాలి? ఎలా చదువుకోవాలి అనే విషయం ఎవరికి తెలియడం లేదు. కొందరి చదువులు దేనికోసమే అర్థం కాదు. చదివే చదువుకు అర్థం లేకపోతే ఎలాంటి లాభం ఉండదు. ఇంతకీ చదువుకు అర్థం ఏమిటో తెలుసా? అయితే ఓ సారి తెలుసుకోండి.

చదువు వల్ల పరీక్షలు మాత్రమే పాస్ అవడం కాదు. దీని వల్ల భవిష్యత్తులో జ్ఞానం రావాలి అంటారు నిపుణులు. బీటెక్, పీజీల వల్ల కేవలం డిగ్రీలు రావడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. బీటెక్ లో ఏం చేశావు అని అడిగితే చాలా మంది ఎలక్ట్రానిక్స్ అంటారు. కానీ ఇంట్లో కరెంటు సమస్యలు వస్తే వాటిని సాల్వ్ చేయడానికి మరొక ఎలక్ట్రానిక్ ను పిలుస్తుంటారు. మరి ఇంట్లో లక్షలు పెట్టి బీటెక్ చదివిన వారి వల్ల ప్రయోజనం ఏమిటి? అదే సమస్యను బీటెక్ చేసిన వారిని అడిగితే మాకు ఇది తెలియదు అంటారు కొందరు.

ఇలాంటి చదువుల వల్ల ప్రయోజనం ఉండదు. అగ్రికల్చర్ లో బీఎస్సీ అవుతుంది. కానీ అగ్రికల్చర్ మాత్రం చేయలేరు. ఇలాంటి చదువు వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఈరోజు మీ చదువుల వల్ల రేపటి సమస్యలు తీరాలి. ఇల్లు, నిర్మాణాలు కడుతుంటే స్మశానాలు కూల్చి కడుతుంటారు. కానీ ఇక్కడే జ్ఞానం అర్థం అవుతుంది. స్మశానాన్ని కూల్చి నిర్మాణాలు చేస్తున్నారు కానీ స్మశానానికి స్థలం ఉంచాలి అనుకోవడం లేదు. పెద్ద బిల్డింగ్ లో ఏదైనా సమస్యలు వస్తే తాపీ మేస్త్రీని పిలుస్తున్నారు కానీ బీటెక్ చేసిన వారు వెళ్లి సరి చేయడం లేదు.

మీ చదువు ఏదైనా సరే ఆ చదువుకు సంబంధించిన పూర్తి పని ఇంట్లో అవ్వాల్సిందే. అప్పుడే మీ చదువుకు పూర్తి న్యాయం జరిగినట్టు. లక్షలు పెట్టి చదివిన చదువుకు ప్రయోజనం చేకూరినట్లు అంటారు నిపుణులు. మరి మీ చదువు వల్ల మీకు ఎంత వరకు లాభం, ప్రయోజనం చేకూరాయో ఒకసారి మీరే ఆలోచించండి.