Bhumika Chawla: 40 ప్లస్ లో ఫ్రాక్ వేసిన భూమిక… ఈ వయసులో చూపించడం ఏంటి బాబోయ్!

Bhumika Chawla: స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని షేక్ చేసింది భూమిక చావ్లా. మిలీనియం ప్రారంభంలో ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. భూమిక మొదటి చిత్రం యువకుడు. 2000 సంవత్సరంలో విడుదలైంది. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీ ఆడలేదు. అయితే రెండో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తమ్ముడు రీమేక్ బద్రి చిత్రంలో విజయ్ కి జంటగా ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ లో బద్రి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మూడో చిత్రం […]

Written By: Shiva, Updated On : April 10, 2023 10:35 am
Follow us on

Bhumika Chawla

Bhumika Chawla: స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని షేక్ చేసింది భూమిక చావ్లా. మిలీనియం ప్రారంభంలో ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. భూమిక మొదటి చిత్రం యువకుడు. 2000 సంవత్సరంలో విడుదలైంది. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీ ఆడలేదు. అయితే రెండో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తమ్ముడు రీమేక్ బద్రి చిత్రంలో విజయ్ కి జంటగా ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ లో బద్రి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మూడో చిత్రం ఖుషి ఇండస్ట్రీ హిట్. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు ఎస్ జే సూర్య తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ యూత్ ని ఊపేసింది. 2001లో ఖుషి అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించింది.

ఆ మూవీతో భూమిక క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్డ్ పక్కన ఛాన్సులు పట్టేసింది. ఒక్కడు, సింహాద్రి ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. భూమిక కుర్రాళ్ళ కలల రాణిగా అవతరించారు. అయితే ఆమె ఎంచుకున్న సబ్జెక్ట్స్ కెరీర్ ని దెబ్బతీశాయి. కమర్షియల్ హీరోయిన్ గా ఎదుగుతున్న రోజుల్లో మిస్సమ్మ వంటి ప్రయోగాత్మక చిత్రం చేసింది.

మిస్సమ్మ మూవీలో ఆమెది నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్. బ్లాక్ బస్టర్ ఆరంభం లభించినా భూమిక సరిగా ఉపయోగించుకోలేకపోయింది. వివిధ పరిశ్రమలలో చిత్రాలు చేసినా స్టార్ గా ఆమె కొద్ది కాలమే ఉన్నారు. శ్రియ శరన్ మాదిరి లాగ్ కెరీర్ అనుభవించలేదు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎం సి ఏ, యూ టర్న్, సవ్యసాచి, రూలర్ ఇలా పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.

Bhumika Chawla

అయితే భూమిక సిల్వర్ స్క్రీన్ మీద స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. ఆమె హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె తీరు చూసిన జనాలు వాపోతున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్న భూమిక అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఫ్రాక్ ధరించి ఓ వీడియో చేసింది. ఈ గ్లామరస్ వీడియో వైరల్ గా మారింది. భూమిక వీడియో వైరల్ అవుతుంది. ఇక 2007లో భూమిక భరత్ ఠాగూర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి 2014లో అబ్బాయి పుట్టాడు.