Photo Story: ఇటీవల కొందరు భామల చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కూళ్లలో, కళాశాలల్లో తమ బంధువులతో ఉన్న ఫొటోలను నటులు బయటపెడుతన్నారు. బర్త్ డే, ఇతర సందర్భంగా ఇవి నెట్టింట్లోకి రావడంతో అవి వైరల్ అవుతున్నాయి. లేటేస్టుగా సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలను ఏలిన ఓ భామకు సంబంధించిన చైల్డ్ పిక్ వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత అగ్రహీరోలందరితో నటించి మెప్పించింది. కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే ఈమె ఓ మొబైల్ కంపెనీ అధినేతను పెళ్లి చేసుకొని సెటిలైంది. ప్రస్తుతం ఆ నటికి సంబంధించిన లేటేస్ట్ పిక్స్ అలరిస్తున్నాయి.
ఆ భామ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. లేదంటే చెప్పేస్తాం.. ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ఆసిన్.. 1985 అక్టోబర్ 26న జన్మించిన ఆసిన్ తొట్టుంకుల్.. భరతనాట్య క్రీడాకారిణి. 15 ఏళ్ల వయసులోనే ఆసిన్ ‘సన్నాఫ్ మహాలక్ష్మి’ అనే తమిళ చిత్రంలో కనిపించింది. ఆ తరువాత తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’తో మొదటిసారి కనిపించింది. ఈ సినిమాలో ఆసిన్ పర్ఫామెన్స్ చూసి అంతా ఫిదా అయ్యారు. తమిళంలో సూర్యతో కలిసి ‘గజిని’ సినిమా చేసిన తరువాత ఫేమస్ అయ్యారు.
తెలుగు, తమిళం సినిమాలే కాకుండా నార్త్ ఇండస్ట్రీలోనూ ఆసిన్ హవా కొనసాగించింది. అజయ్ దేవ్ గన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోల పక్కన నటించింది. ఎనిమిది భాషల్లో మాట్లాడగలే ఆసిన్ తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. నటి పద్మిని తరువాత అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకున్న నటి ఎవరంటే ఆసిన్ అని చెప్పుకుంటారు. 2007లో ఆన్ లైన్ తమిళ సినిమా పత్రికలు ఆసిన్ ను క్వీన్ ఆఫ్ కోలివుడ్ గా అభివర్ణించాయి.
కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే ఆసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా జన్మించింది. చాలా మంది ఆసిన్ ను పెళ్లయిన తరువాత సినిమాల్లో నటించమని కోరారు. కానీ ఆమె అందుకు ససెమిరా అంది. అయితే సోషల్ మీడియా ద్వారా తన లేటేస్ట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆమె లేటేస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.