Simhadri Re Release Collection: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘సింహాద్రి’ చిత్రం గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ని మాస్ ఆడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా చెరిగిపోని ముద్ర వేసిన ఈ చిత్రం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్.#RRR చిత్రం తో పాన్ వరల్డ్ క్రేజ్ దక్కిన ఆనందం లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసి సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్.
కొత్త సినిమా విడుదల అయ్యినట్టు ఉదయం ఆటల నుండే ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ప్రతీ చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఒక రీ రిలీజ్ కి ఈ రేంజ్ ఉదయం ఆటలు హౌస్ ఫుల్స్ పడడం గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా మరియు ఖుషి చిత్రాల రీ రిలీజ్ అప్పుడు మాత్రమే జరిగింది,ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకే జరిగింది.
అయితే ఉదయం ఆటలు బాగానే హౌస్ ఫుల్స్ అయ్యాయి కానీ, ఆ తర్వాతి షోస్ నుండి మాత్రం వసూళ్లు బాగా డౌన్ అయ్యాయి. పెద్ద పెద్ద సిటీలలో కూడా కనీస స్థాయి ఆక్యుపెన్సీలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ చిత్రం రీ రిలీజ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.నెల రోజుల ముందుగానే పబ్లిసిటీ ప్రారంభించి, పది రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెలబ్రిటీస్ ని పిలిపించి గ్రాండ్ గా చేసారు.
ఇందుకు అయిన ఖర్చు దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. అంత డబ్బులు ఖర్చు చేసి విడుదల చేస్తే గ్రాస్ వసూళ్లు నాలుగు కోట్ల రూపాయిల కంటే తక్కువే ఉండే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే కనుక జరిగితే ఇంత ఖర్చు చేసి నష్టాలను కొని తెచ్చుకున్న ఏకైక రీ రిలీజ్ సినిమాగా సింహాద్రి నిలిచిపోతుంది.