Anushka Shetty
Anushka Shetty : సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్స్ ఎవరు అంటే మనకి గుర్తుకు వచ్చే పేర్లలో అనుష్క శెట్టి పేరు ముందు ఉంటుంది. సూపర్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన అనుష్క శెట్టి, ఆ(Anushka Shetty)సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేసుకుంటూ వెళ్లిన అనుష్క శెట్టి జీవితాన్ని మార్చేసిన చిత్రం ‘విక్రమార్కుడు’. రవితేజ(Mass Maharaja Raviteja), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. అనుష్క కి అందం పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా ఈ చిత్రం బాగా కలిసొచ్చింది. యూత్ ఆడియన్స్ ఆమెకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యేలా చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్లిన అనుష్క శెట్టి కెరీర్ ని మరో మలుపు తిప్పిన చిత్రం ‘అరుంధతి’. ఈ సినిమా తర్వాత ఆమె లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది.
ఆరోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) నటించిన ‘పోకిరి’ చిత్రం 35 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలబడితే, ‘అరుంధతి’ ఏకంగా 34 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి టాప్ 2 గా నిల్చింది. ఆమెకు ఉన్నటువంటి ఈ కలెక్షన్స్ రికార్డు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ కి కూడా లేదు. ప్రభాస్, అల్లు అర్జున్ అయితే దరిదాపుల్లో కూడా ఉండేవారు కాదు. కేవలం రామ్ చరణ్(Globalstar Ramcharan) ఒక్కడే ‘మగధీర’ చిత్రం తో అదే సంవత్సరం లో 70 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టాడు. అయితే అరుంధతి తర్వాత అనుష్క కి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ, స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించేది. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసేది. కానీ ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తప్ప , రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయడం లేదు.
‘బాహుబలి’ తర్వాత ఆమె ‘భాగమతి’ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత ‘నిసభ్డం’ అనే సినిమా చేసింది కానీ, అంతగా ఆ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. చాలా కాలం గ్యాప్ ఇచ్చి చేసిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటీ'(Ghaati Movie) అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మీరంతా చూసే ఉంటారు, అనుష్క ని అంత వయొలెంట్ గా చూసి మీకు కూడా వణుకు పుట్టుంది కదూ. ఏప్రిల్ లో ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నది. ఇందులో ఆమె చక్కగా చీర కట్టుకొని తన వింటేజ్ డేస్ ని ఒకసారి అభిమానులకు గుర్తు చేసింది. కానీ అప్పట్లో ఉన్నంత సన్నగా అయితే ఇప్పుడు లేదు ,కాస్త బొద్దుగా తయారైంది.