https://oktelugu.com/

Anushka : ఆరవ తరగతి లోనే ఆ అబ్బాయితో హీరోయిన్ అనుష్క అలాంటి పనులు చేసిందా..? కనిపించేంత సాఫ్ట్ కాదుగా!

అయితే ఇదే విషయం పై గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'నేను ఆరవ తరగతి లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ప్రేమించేవాడు. ఒక రోజు నాకు వచ్చి నువ్వు చాలా అందం గా ఉంటావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ప్రపోజ్ చేసాడు. ఊహ తెలియని వయస్సు కాబట్టి నేను కూడా ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను,అంతే నా లవ్ స్టోరీ. వయసు పెరిగిన తర్వాత నేను ఎవరితో కూడా ప్రేమలో పడలేదు' అని చెప్పుకొచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : July 1, 2023 / 07:15 PM IST
    Follow us on

    Anushka : టాలీవుడ్ లో అందాల ఆరబోతతో పాటుగా అద్భుతమైన నటన కనబర్చే హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సూపర్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా టాలీవుడ్ లో అవకాశాలకు మాత్రం కొదవే లేకుండా దూసుకెళ్లింది.

    ఆ తర్వాత ఆమెకి హిట్టు మీద హిట్టు తగిలి, ‘అరుంధతి’ చిత్రం తో సౌత్ లోనే స్టార్ హీరోలతో సమానంగా బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనుష్క, సోలో హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ఒకపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే, మరో పక్క స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా కూడా చేసేది. ఇక బాహుబలి సిరీస్ తో ఆమె రేంజ్ పాన్ ఇండియా రేంజ్ కి ఎగబాకిన సంగతి అందరికీ తెలిసిందే.

    అయితే ఈ మధ్య ఈమె పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు, లేటెస్ట్ గా నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటించింది. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే అనుష్క పై సోషల్ మీడియా లో ఎన్నో రూమర్స్ ప్రచారం అయ్యే సంగతి మన అందరికీ తెలిసిందే.

    అయితే ఇదే విషయం పై గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నేను ఆరవ తరగతి లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ప్రేమించేవాడు. ఒక రోజు నాకు వచ్చి నువ్వు చాలా అందం గా ఉంటావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ప్రపోజ్ చేసాడు. ఊహ తెలియని వయస్సు కాబట్టి నేను కూడా ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను,అంతే నా లవ్ స్టోరీ. వయసు పెరిగిన తర్వాత నేను ఎవరితో కూడా ప్రేమలో పడలేదు’ అని చెప్పుకొచ్చింది.