Tamanna : ముద్దు కోసం తమన్నా ని ఆ స్టార్ హీరో ఇంతలా బలవంతం చేశాడా..? వైరల్ అవుతున్న కామెంట్స్  

స్వయంగా స్టార్ హీరోనే రంగం లోకి దిగి, ఆ సన్నివేశం లో నటించాల్సిందిగా బ్రతిమిలాడాడట, ఇబ్బంది కూడా పెట్టాడట , కానీ తమన్నా నో అని బలంగా చెప్పడం తో ఆ సన్నివేశాన్ని సినిమా నుండే తొలగించేశారట. ఈ విషయాన్నీ తమన్నానే స్వయంగా చెప్పుకొచ్చింది.

Written By: Vicky, Updated On : July 2, 2023 9:46 am
Follow us on

Tamanna : గత కొద్దీ రోజుల నుండి టాలీవుడ్ లో తమన్నా ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా ఈమెనే కనిపిస్తుంది. రీసెంట్ సమయం లో ఈమె చేసిన సినిమాలు, చేసిన సన్నివేశాలు అటువంటివి మరి.ఒకప్పుడు లిప్ కిస్ లకు నో చెప్పేది ఈ హాట్ బ్యూటీ, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్, మరియు ఎంత పెద్ద హీరో అడిగినా కూడా ససేమీరా అంటూ మొహం మీద చెప్పేసేది.

అయితే బలవంతంగా కొంతమంది దర్శకులు అడగడం వల్ల , ఊరికి పైపైకి ముద్దు పెడుతున్నట్టు నటించేది కానీ మిగతా హీరోయిన్స్ లాగ ఇన్వాల్వ్ అయ్యి చేసేది కాదు. కానీ రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ముద్దు సన్నివేశాల్లో మాత్రమే కాదు, ఏకంగా బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా నటించేస్తుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘లాస్ట్ స్టోరీస్’ లో ఈ హాట్ బ్యూటీ చేసిన రొమాన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఎందుకంటే ఈ సినిమాలో ఆమె అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ సమయం లో ఆమె ఒక ఆసక్తికరమైన సంఘటన ని పంచుకుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఆమె కథ ఎంత డిమాండ్ చేసిన ముద్దు సన్నివేశాల్లో నటించకూడదు అని రూల్ పెట్టుకుందట. డైరెక్టర్స్ ఆమెని ఎంత రిక్వెస్ట్ చేసినా ‘నేను నో కిస్సింగ్ రూల్’ ని ఫాలో అవుతున్నాను అని చెప్పేడట. ఒకసారి ఒక దర్శకుడితో ఈ విషయమై చిన్నపాటి గొడవ కూడా జరిగిందట.

కథ కి ఎంతో కీలకమైన సన్నివేశం లో ముద్దు తప్పనిసరి అని డైరెక్టర్ చాలా ఫోర్స్ చేసాడట, కానీ తమన్నా నుండి నో అని సమాధానం వచ్చిందట. ఇక తన మొరని ఆ సినిమాకి పని చేస్తున్న స్టార్ హీరో కి చెప్పుకున్నాడట. స్వయంగా స్టార్ హీరోనే రంగం లోకి దిగి, ఆ సన్నివేశం లో నటించాల్సిందిగా బ్రతిమిలాడాడట, ఇబ్బంది కూడా పెట్టాడట , కానీ తమన్నా నో అని బలంగా చెప్పడం తో ఆ సన్నివేశాన్ని సినిమా నుండే తొలగించేశారట. ఈ విషయాన్నీ తమన్నానే స్వయంగా చెప్పుకొచ్చింది.